- తెలుగునాడు ఉపాధ్యాయ సంఘం
జిల్లా పునర్విభజనలో ఉపాధ్యాయులకు అన్యాయం చేయొద్దుని, అసలు నియామక తేదీ ఆధారంగా సీనియారిటీ కల్పించాలని తెలుగునాడు ఉపాధ్యాయ సంఘం (టిఎన్‌యుఎస్) డిమాండ్ చేసింది. ఈ మేరకు ఆ సంఘ రాష్ట్ర అధ్యక్షు, ప్రధాన కార్యదర్శులు మన్నం శ్రీనివాస్, రామిశెట్టి వెంకటేశ్వర్లు శనివారం ఒక ప్రకటన విడుదల చేశారు. జిల్లా పునర్విభజన నేపథ్యంలో ఉపాధ్యాయుల జిల్లా అలాట్‌మెంట్ కోసం రూపొందిస్తున్న జిల్లా సీనియారిటీ జాబితాల్లో ప్రమోషన్ రివర్షన్ తీసుకున్న ఉపాధ్యాయులు, ఎయిడెడ్ విద్యాసంస్థల నుంచి మండల, జిల్లా పరిషత్, ఇతర ప్రభుత్వ పాఠశాలల్లో విలీనమైన ఉపాధ్యాయులు, అంతర జిల్లా బదిలీల ద్వారా వచ్చిన ఉపాధ్యాయులకు వారి అసలు నియామక తేదీ ఆధారంగా సీనియారిటీ కల్పించాలని తెలిపారు. జిల్లా పునర్విభజన అనేది కేవలం పరిపాలనా సౌలభ్యం కోసం చేపట్టిన ప్రక్రియ మాత్రమేనని, ఈ ప్రక్రియ వల్ల సుదీర్ఘకాలంగా ప్రభుత్వ సేవలో ఉన్న ఉపాధ్యాయులు తమ న్యాయమైన సీనియారిటీని కోల్పోయే పరిస్థితి ఏర్పడకూడదని పేర్కొన్నారు.








కామెంట్‌లు (0)