మంగళవారం, 21 జులై 2026E-PAPER
మ్యాగజైన్స్

ఏపీ వ్యాప్తంగా దస్తావేజు లేఖరుల సమ్మె.. రిజిస్ట్రేషన్లకు తీవ్ర అంతరాయం

17 గంటల క్రితం

pendwon
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జులై 20, 2026, 12:47 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

ప్రజాశక్తి-అమరావతి: రాష్ట్రవ్యాప్తంగా దస్తావేజు లేఖరులు చేపట్టిన పెన్‌డౌన్ సమ్మెతో ఆస్తుల రిజిస్ట్రేషన్ ప్రక్రియ తీవ్రంగా దెబ్బతింది. సబ్-రిజిస్ట్రార్ కార్యాలయాల్లో రిజిస్ట్రేషన్లు నిలిచిపోవడంతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. పీపీపీ (పబ్లిక్-ప్రైవేట్ పార్ట్‌నర్‌షిప్) విధానంలో రిజిస్ట్రేషన్ సేవా కేంద్రాల ఏర్పాటును వ్యతిరేకిస్తూ డాక్యుమెంట్ రైటర్లు సమ్మెకు దిగారు. ఈ విధానం అమల్లోకి వస్తే తమ ఉపాధికి తీవ్ర నష్టం జరుగుతుందని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పెన్‌డౌన్ కారణంగా రాష్ట్రంలోని 294 సబ్-రిజిస్ట్రార్ కార్యాలయాల్లో దస్తావేజుల తయారీ, ఆస్తుల రిజిస్ట్రేషన్ ప్రక్రియకు తీవ్ర విఘాతం ఏర్పడింది. ప్రభుత్వం వెంటనే పీపీపీ విధానాన్ని ఉపసంహరించుకుని తమ సమస్యలను పరిష్కరించాలని దస్తావేజు లేఖరులు డిమాండ్ చేశారు.


సంబంధిత వార్తలు

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్