సోమవారం, 14 సెప్టెంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

‘అనంత’లో కరువు సహాయక చర్యలు చేపట్టాలి

7 గంటల క్రితం

ram
వెబ్ డెస్క్

ప్రచురించబడింది సెప్టెం 14, 2026, 12:34 పూర్వాహ్నం | 2 నిమిషాల చదవడం

- సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు వి.రాంభూపాల్‌

- పర్చూరులో పొలాలు, చెరువులు పరిశీలన

‌ప్రజాశక్తి - అనంతపురం కలెక్టరేట్, పర్చూరు (బాపట్ల జిల్లా) : ఎల్‌‌నినో వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో పంటలు ఎండిపోయి, అనంతపురం జిల్లాలో కరువు ఏర్పడిందని, ఇలాంటి సమయంలో టిడిపి కూటమి ప్రభుత్వం స్పందించి తక్షణమే కరువు సహాయక చర్యలు చేపట్టాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు వి.రాంభూపాల్‌ ‌డిమాండ్‌ ‌చేశారు. సిపిఎం జిల్లా కార్యదర్శి ఓ.నల్లప్ప పార్టీ ప్రతినిధులతో కలిసి అనంతపురం జిల్లా గార్లదిన్నె మండల పరిధిలోని మర్తాడు గ్రామంలో వేరుశనగ పంటను ఆదివారం ఆయన పరిశీలించారు. మర్తాడు గ్రామంలో కౌలు రైతు ఇమామ్ వలి మాట్లాడుతూ తాను సాగు చేసిన నాలుగు ఎకరాల వేరుశనగ పంటకు కౌలు, పెట్టుబడులు ఇతరత్రా ఖర్చులు కలిపి సుమారు రూ.రెండు లక్షలు ఖర్చయ్యాయని తెలిపారు. అదే గ్రామంలో గిరిజాల వెంకటలక్ష్మి, గిరిజాల సుబ్రమణ్యం, గిరిజాలా సోమశేఖర్‌‌లు సాగు చేసిన పంట కూడా పూర్తిగా ఎండిపోయిందంటూ రైతులు సిపిఎం నాయకుల దృష్టికి తీసుకెళ్లారు. అనంతరం రాంభూపాల్‌ ‌మాట్లాడుతూ గతంలో ఎప్పుడూ లేనంత దుర్భిక్షంలో రైతులు ఉన్నారన్నారు. విత్తనం వేసింది మొదలు ఇప్పటి వరకు చినుకుజాడ లేదని ఆవేదన వ్యక్తం చేశారు. వేరుశనగకు ఎకరాకు రూ.30 వేలు పరిహారం ఇవ్వాలని కోరారు.

ramas

పర్చూరులో పొలాలు, మంచినీటి చెరువులను పరిశీలించిన రమాదేవి...

కరువు వల్ల తాగునీటికి కటకటగా ఉందని పర్చూరు మండలం, బోడవాడ రైతులు సిపిఎం నేతల ఎదుట ఆవేదన వ్యక్తం చేశారు. సిపిఎం కేంద్ర కమిటీ సభ్యులు బి.రమాదేవి బోడవాడ గ్రామంలో వర్షాభావం వల్ల సాగు చేయని పొలాలను, గ్రామంలోని మంచినీటి చెరువులను పరిశీలించారు. అక్కడ ఉన్న రైతులతో మాట్లాడారు. మంచినీటి ఫిల్టర్ బెడ్లు పని చేయక ఆర్‌ఒ ప్లాంట్ ఒక లీటరు మంచినీటికి నాలుగు లీటర్ల నీళ్లు వృథా అవుతున్నాయని, మూడు నెలలుగా ఆర్‌ఒ ప్లాంట్‌లు ఆపివేశారని గ్రామస్తులు తెలిపారు. పర్చూరు నుండి తాగునీటిని డబ్బా 20 రూపాయలు పెట్టి కొని తెచ్చుకొని తాగుతున్నామన్నారు. రమాదేవి మాట్లాడుతూ నెదర్లాండ్ మంచినీటి స్కీమ్ పునరుద్ధరించాలని, మంచినీటి సమస్యను పరిష్కరించాలని, ఫిల్టర్ బెడ్లను రిపేర్ చేయించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రైతులు మాట్లాడుతూ గత సంవత్సరం పండించిన పొగాకు మండెలను ఇంటి ముందు పెట్టుకోవడం.. శవాన్ని ఇంటి ముందు పెట్టుకున్నట్లే ఉందని ఆవేదన వ్యక్తంచేశారు. పర్చూరు మండలంలో కరువు తీవ్రంగా ఉందని, తక్షణమే కరువు ప్రాంతంగా ప్రకటించి సహాయక చర్యలు చేపట్టాలన్నారు.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్