సోమవారం, 14 సెప్టెంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

దిమాగున్న యువతరం

4 గంటల క్రితం

y
వెబ్ డెస్క్

ప్రచురించబడింది సెప్టెం 14, 2026, 03:45 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం

దిమాగున్న యువతరమిది

దబాయింపు పనిచెయ్యదు!

నిలదేసే వాళ్లెవరూ బెదరిపోరు, చెదరిపోరు!

కొలువులేని చదువులిచ్చు - విలువలేని డిగ్రీలు;

ముసురుకున్న చీకటిలో - విసిగి వేసారెను యువత.

దిమాగున్న యువతరమిది...


ధనదాహపు ప్రైవేటు చదువు, కోచింగు సెంటర్ల మాయ

మాఫియాల దగుల్బాజీ, ప్రతిసారీ లీకేజీ!

ప్రశ్నిస్తే, నిలదీస్తే – లాఠీలు, బ్యారికేడ్‌లు!

దిమాగున్న యువతరమిది...


మేలుకుంది, మేటి యువత – మభ్యపెట్టి, మాయజేయు,

ఎత్తులింక ఫలించవు;

జంకుగొంకు లేనిది ఈ కొత్త యుగపు జనుల గళం!

దిమాగున్న యువతరమిది...


కొత్త నీరు వచ్చి చేరె, ఆగదింక ప్రవాహము!

మారుతోంది, గాలి చూడు!

పైకెత్తు తెరచాప, చేబట్టు చుక్కాని!

రానున్నవి సుదినాలు, ప్రజాపక్ష విజయాలు!

దిమాగున్న యువతరమిది...

- ఉణుదుర్తి సుధాకర్


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్