ప్రజాశక్తి - అనంతపురం కలెక్టరేట్ : తమకు పింఛన్ల కోసం గుర్తింపు కార్డులు, వివిధ సర్టిఫికెట్లతో కాకుండా సెల్ఫ్ డిక్లరేషన్ ఆధారంగా దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించాలని కోరుతూ డప్పు కళాకారులు, చర్మకారులు మంగళవారం ధర్నా చేశారు. అనంతపురం సోషల్ వెల్ఫేర్ కార్యాలయం వద్ద నిర్వహించిన ఈ ఆందోళనలో కెవిపిఎస్ రాష్ర్ట అధ్యక్షుడు ఓ.నల్లప్ప మాట్లాడారు. సాంఘిక సంక్షేమ శాఖ ద్వారా సర్టిఫికెట్ తప్పనిసరి అని చెప్పి పింఛన్ల కోసం ఎదురుచూస్తున్న డప్పు కళాకారులు, చర్మకారులకు తీవ్ర అన్యాయం చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. డప్పు కళాకారుల గుర్తింపు కార్డు ఉన్నప్పటికీ తప్పనిసరిగా సాంఘిక సంక్షేమ శాఖ ధ్రువీకరణ పత్రం ఇవ్వాలనే పేరుతో కొన్ని సచివాలయాల్లో దరఖాస్తులు నమోదు చేయడం లేదన్నారు. తక్షణం ఈ నిబంధనను ఎత్తేయాలని డిమాండ్ చేశారు. దరఖాస్తు గడువును కూడా ఈ నెలాఖరు వరకు పెంచాలని కోరారు. ఈ సందర్భంగా జిల్లా సోషల్ వెల్ఫేర్ డిడి స్పందిస్తూ డప్పు కళాకారులు, చర్మకారులకు గుర్తింపు కార్డులతో సంబంధం లేకుండా దరఖాస్తు చేసుకోవడానికి అనుమతులిస్తున్నామని, సెల్ఫ్ డిక్లరేషన్ ఆధారంగా దరఖాస్తు చేసుకునేలా వెంటనే ఆదేశాలు జారీ చేస్తామని హామీ ఇచ్చారు. దీంతో, నాయకులు ఆందోళన విరమించారు. ఈ కార్యక్రమంలో ఎస్‌సి సంక్షేమ సంఘం నాయకులు ఎల్లన్న, కెవిపిఎస్ జిల్లా అధ్యక్షులు జి.వెంకటేష్, ఎం.గంగాధర్, జిల్లా నాయకులు రాజా, నాగేంద్రతో పాటు డప్పు కళాకారులు, చర్మకారులు పాల్గొన్నారు.
Print Editionపింఛన్లకు ని‘బంధనాల’పై డప్పు కళాకారులు, చర్మకారుల ధర్నా
1 గంట క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది సెప్టెం 08, 2026, 09:52 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్‌లు
సంబంధిత వార్తలు






కామెంట్‌లు (0)