హైదరాబాద్ : ఎపి లిక్కర్ స్కాం కేసులో నిందితులకు నాంపల్లి కోర్టు మూడు రోజుల ఈడి కస్టడీ విధించింది. కోర్టు ఆదేశాల మేరకు ఎపిఎస్‌బిసిఎల్ మాజీ ఎండి వాసుదేవ రెడ్డి, రాజ్ కసిరెడ్డి, మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు కుమారుడు సునీల్‌లను గురువారం నుండి ఈడి కస్టడీలోకి తీసుకుని విచారించనుంది. చర్లపల్లి జైలులో ఉన్న ముగ్గురు నిందితులకు ముందుగా వైద్య పరీక్షలు నిర్వహించి, అనంతరం ఈడీ కార్యాలయానికి తరలించారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో మద్యం రవాణా టెండర్ల కేటాయింపులో భారీ అక్రమాలు జరిగాయనే ఆరోపణలపై ఈడీ మనీలాండరింగ్ కోణంలో దర్యాప్తు చేపట్టింది. టెండర్ల నిబంధనలను నిబంధనలకు విరుద్ధంగా మార్చడం వల్ల ప్రభుత్వానికి సుమారు రూ.195 కోట్ల మేర నష్టం జరిగిందని ఈడీ ఆరోపిస్తోంది. ఈ వ్యవహారంలో నిధుల మళ్లింపు, అక్రమ ఆర్థిక లావాదేవీలు జరిగాయా అనే కోణంలో అధికారులు విచారణ కొనసాగిస్తున్నారు.
ఎపి లిక్కర్ స్కాం కేసు నిందితులకు ఈడి కస్టడీ
16 జులై, 2026

వెబ్ డెస్క్
ప్రచురించబడింది జులై 16, 2026, 04:09 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్‌లు
సంబంధిత వార్తలు







కామెంట్‌లు (0)