గురువారం, 01 అక్టోబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

కెప్టెన్ స్మిత్ మచ్చార్ ధైర్యానికి ప్రధాని మోదీ ప్రశంసలు

56 నిమిషాల క్రితం

pm modi
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 01, 2026, 08:09 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం

- విమాన ప్రమాదం తప్పించిన పైలట్

న్యూఢిల్లీ: ప్రాణాపాయ పరిస్థితుల్లోనూ వందలాది మంది ప్రయాణికుల ప్రాణాలను కాపాడిన భారతీయ పైలట్ కెప్టెన్ స్మిత్ మచ్చార్ ధైర్యాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రశంసించారు. గాయపడినప్పటికీ అత్యంత సాహసోపేతంగా వ్యవహరించి విమానాన్ని సురక్షితంగా ల్యాండ్ చేయడం గొప్ప విషయమని మోదీ ఎక్స్ వేదికగా కొనియాడారు. స్మిత్ త్వరగా కోలుకుని సంపూర్ణ ఆరోగ్యంతో తిరిగి రావాలని ఆకాంక్షిస్తూ, ఆయన సాహసానికి భారత్ గర్విస్తోందని పేర్కొన్నారు. దుబాయ్ నుంచి టెల్ అవీవ్‌కు వెళ్తున్న ఫ్లైదుబాయ్ విమానం FZ1073లో గాల్లోనే అనూహ్య ఘటన చోటుచేసుకుంది. విమానం కాక్‌పిట్‌లో పైలట్ల మధ్య ఘర్షణ జరిగి, ఒక పైలట్‌పై మరో పైలట్ దాడి చేసినట్లు అధికారులు వెల్లడించారు.

ప్రయాణ సమయంలో అత్యవసర పరిస్థితి ఏర్పడడంతో విమానం ఎత్తు ఒక్కసారిగా తగ్గి, మార్గంలో అసాధారణ మార్పులు చోటుచేసుకున్నట్లు ఫ్లైట్ ట్రాకింగ్ డేటా సూచించింది. తీవ్రంగా గాయపడిన కెప్టెన్ స్మిత్ మచ్చార్ పరిస్థితిని అదుపులోకి తీసుకుని విమానాన్ని సౌదీ అరేబియాలోని తబూక్ ఎయిర్‌పోర్ట్‌లో సురక్షితంగా దింపారు.

విమానంలోని ప్రయాణికులందరూ క్షేమంగా ఉన్నారని ఫ్లైదుబాయ్ సంస్థ ధ్రువీకరించింది. కెప్టెన్ స్మిత్‌తో పాటు ఫస్ట్ ఆఫీసర్‌కు ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. కాక్‌పిట్‌లో ఘర్షణకు దారితీసిన కారణాలపై దర్యాప్తు కొనసాగుతోంది.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్