వాషింగ్టన్: అమెరికా–ఇరాన్ మధ్య శాంతి చర్చలు కొనసాగుతున్న వేళ వాషింగ్టన్ మరోసారి ఆంక్షలు విధించింది. ఇరాన్ రక్షణ రంగానికి ఆయుధాలు, ఆయుధ భాగాల సేకరణలో సహకరిస్తున్నాయని ఆరోపిస్తూ 10 మంది వ్యక్తులు, సంస్థలపై అమెరికా ఆర్థిక శాఖ ఆంక్షలు ప్రకటించింది. ఈ చర్యలు ఇరాన్ సైనిక సరఫరా వ్యవస్థను దెబ్బతీయడమే లక్ష్యంగా ఉన్నాయని అమెరికా పేర్కొంది. ఇరాన్ సైనిక సంస్థల ఆర్థిక నెట్‌వర్క్‌లను ఛేదించేందుకు ఉపయోగపడే సమాచారాన్ని అందించేవారికి 15 మిలియన్ డాలర్ల వరకు బహుమతి ఇస్తామని అమెరికా విదేశాంగ శాఖ ప్రకటించింది. మరోవైపు, అమెరికా ఆంక్షలు ఎత్తివేసే వరకు హార్ముజ్ జలసంధిని తెరవబోమని ఇరాన్ సైనిక వర్గాలు స్పష్టం చేశాయి. గట్టిగా దెబ్బతిన్న శత్రువు మరిన్ని గట్టి దెబ్బలు తినడానికి సిద్ధంగా ఉండాలి. హార్ముజ్ ను ఏడు రోజుల్లో తెరవాలన్న ప్రతిపాదనపై అమెరికా అధికారిక స్పందన కోసం ఎదురుచూస్తున్నామని ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాఘ్చి తెలిపారు. ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెషెష్కియాన్ కూడా అమెరికాతో చర్చల విశ్వసనీయతపై ప్రశ్నలు లేవనెత్తారు.
దీంతో ఒకవైపు దౌత్యపరమైన చర్చలు కొనసాగుతుండగా, మరోవైపు అమెరికా ఆంక్షలు, ఇరాన్ నుంచి హార్ముజ్ జలసంధిపై కఠిన వైఖరి ప్రాంతీయ ఉద్రిక్తతలను కొనసాగిస్తున్నాయి.







కామెంట్‌లు (0)