- కవాతు విభాగంలో అవార్డులు
ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : రాజధాని అమరావతిలోని నేలపాడులో 80వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో శకటాల ప్రదర్శనను శనివారం ఘనంగా నిర్వహించారు. విద్యా సమగ్రశిక్ష శకటానికి, ఉద్యానవనశాఖల శకటానికి సంయుక్తంగా ప్రథమ బహుమతి లభించింది. ద్వితీయ బహుమతిగా చేనేత, జౌళిశాఖకు లభించింది. అడవులను రక్షించండి, వన్య ప్రాణులను కాపాడండి అంటూ హరితాంధ్ర లక్ష్యంగా చేసుకుని సాగిన అటవీశాఖ శకటానికి తృతీయ బహుమతి వచ్చింది. ఈ సందర్భంగా నిర్వహించిన కవాతు, శకటాల ప్రదర్శనలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. వివిధ విభాగాల ప్రదర్శనల్లో ప్రతిభ కనబరిచిన బృందాలకు బహుమతులు అందజేశారు. ఈ వేడుకల్లో భాగంగా రాష్ట్ర అభివృద్ధి, సంక్షేమ రంగాలపై ప్రభుత్వం వేస్తున్న అడుగులను వివిధ ప్రభుత్వ శాఖల శకటాల ప్రదర్శన నిర్వహించారు. దాదాపు 25 శాఖల నుంచి వచ్చిన శకటాలు ప్రదర్శనలో పాల్గొన్నాయి. ఉత్తమ అమర్ కాంటింజెంట్‌గా ఎపిఎస్‌పి, కర్నూలుకు రెండో స్థానం, రెండో ఉత్తమ ఆర్మ్‌డ్ కాంటింజెంట్‌గా కర్ణాటక స్టేట్ స్పెషల్ పోలీస్, ఉత్తమ అన్ ఆర్మ్‌డ్ కాంటింజెంట్‌గా ఎపి సోషల్ వెల్ఫేర్, రెండో ఉత్తమ అన్ ఆర్మ్‌డ్ కాంటింజెంట్‌గా ఎన్‌సిసి బాలికల బృందం, కన్సొలేషన్ బహుమతిగా సైనిక్ వెల్ఫేర్‌కు లభించాయి.








కామెంట్‌లు (0)