ప్రజాశక్తి-అమరావతి : రాష్ట్రంలోని గ్రామీణ ప్రాంతాలు మినహా మిగతా ప్రాంతాల్లో ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఎత్తివేస్తూ రాష్ట్ర ఎన్నికల సంఘం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నెల 7వ తేదీ శనివారం రాత్రి 10 గంటల నుంచి ఈ ఉత్తర్వులు అమల్లోకి వచ్చినట్లు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ అనిల్ చంద్ర పునేఠ తెలిపారు. రాష్ట్రంలోని మున్సిపల్ కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు, నగర పంచాయతీల ఎన్నికల ప్రక్రియ ఇప్పటికే పూర్తయిందని, మండల పరిషత్, జిల్లా పరిషత్ ఎన్నికల ప్రక్రియ కూడా శనివారంతో ముగిసిందని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. అయితే రాష్ట్రంలో గ్రామ పంచాయతీ ఎన్నికల ప్రక్రియ కొనసాగుతున్న నేపథ్యంలో గ్రామీణ ప్రాంతాల్లో ఎన్నికల ప్రవర్తనా నియమావళి యథావిధిగా అమల్లో ఉంటుందని స్పష్టం చేశారు.
గ్రామీణ ప్రాంతాలు మినహా రాష్ట్రవ్యాప్తంగా ఎన్నికల కోడ్ ఎత్తివేత
7 గంటల క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది నవం 08, 2026, 02:03 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్‌లు
సంబంధిత వార్తలు







కామెంట్‌లు (0)