మంగళవారం, 13 అక్టోబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

రాష్ట్ర ప్రభుత్వం ప్రకటన తర్వాత ఎన్నికల షెడ్యూల్‌ విడుదల

1 గంట క్రితం

ap ec
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 13, 2026, 02:55 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

అమరావతి : గెజిట్‌ నోటిఫికేషన్‌ అనంతరం రాష్ట్రప్రభుత్వ ప్రకటన తర్వాతే ఎన్నికల షెడ్యూల్‌ విడుదల చేస్తామని రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ అనిల్‌ చంద్ర పునేఠా తెలిపారు. విజయవాడలో మంగళవారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎపిలో స్థానిక ఎన్నికలపై రాజకీయ పార్టీల నుండి అభిప్రాయాలు సేకరించినట్లు తెలిపారు. పోటీచేసే అభ్యర్థులకు భద్రత కల్పించాలని రాజకీయ పార్టీలు కోరాయని అన్నారు. సంబంధిత విభాగాల నుండి గెజిట్‌ నోటిఫికేషన్‌ రావాల్సి వుందని, ఎన్నికలకు సిద్ధంగా ఉన్నట్లు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన తర్వాత ఎన్నికల షెడ్యూల్‌ విడుదల చేస్తామని అన్నారు.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్