ప్రజాశక్తి - వేపాడ : వేపాడ మండలంలో ఎంపీడీవో సిహెచ్ సూర్యనారాయణ కొంపల్లి, కె ఆర్ పేట, బానాది, బల్లంకి గ్రామాలను సందర్శించారు. ఈ సందర్భంగా ఆయా గ్రామ సచివాలయాలలో చెత్త నుండి సంపద తయారు చేసే వర్మ కంపోస్ట్ వలన కలిగే ప్రయోజనాలపై గ్రామస్తులకు అవగాహన కల్పించారు. ఈ విధానాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. ‘‘ మీ గ్రామానికి వచ్చే రథానికి మీరు సిద్ధం చేసిన తడి చెత్తను పొడి చెత్తను వేరువేరుగా అందజేసి స్వచ్ఛ రథంలో ప్రభుత్వం మీకు అందిస్తున్న వస్తువులను తీసుకోవచ్చు’’ అని అన్నారు. ఈ విధానం వలన గ్రామము పరిశుభ్రంగా ఉండటంతో పాటు దోమల నివారణతో పాటు రోగాలను నివారించుకోవచ్చని గ్రామస్తులకు వివరించారు. ఈ సందర్శనలో గ్రామపంచాయతీ కార్యదర్శులు సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు
వర్మ కంపోస్ట్ తయారీ కేంద్రాలను విస్తృతంగా పరిశీలించిన ఎంపీడీవో
1 గంట క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది అక్టో 01, 2026, 03:03 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్‌లు
సంబంధిత వార్తలు







కామెంట్‌లు (0)