శనివారం, 15 ఆగస్టు 2026E-PAPER
మ్యాగజైన్స్

ఏలూరు ఎస్‌ఐ అరుదైన సాహస ఘనత

1 గంట క్రితం

si
వెబ్ డెస్క్

ప్రచురించబడింది ఆగ 15, 2026, 12:11 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

ప్రజాశక్తి-ఏలూరు స్పోర్ట్స్: ఏలూరు రూరల్‌ పోలీస్‌ స్టేషన్‌ ఎస్‌ఐ వి. వెంకటేశ్వరరావు అరుదైన సాహస ఘనత సాధించారు. రష్యాలోని కాకసస్‌ పర్వత శ్రేణుల్లో ఉన్న 5,642 మీటర్ల ఎత్తైన మౌంట్‌ ఎల్బ్రస్‌ శిఖరాన్ని అధిరోహించారు. భారత 80వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని సుమారు 100 మీటర్ల పొడవైన త్రివర్ణ పతాకాన్ని శిఖరాగ్రంపై ప్రదర్శించారు. తీవ్రమైన చలి, బలమైన గాలులు, తక్కువ ఆక్సిజన్‌, మంచుతో నిండిన మార్గాలను అధిగమిస్తూ ఆయన ఈ సాహసయాత్రను విజయవంతంగా పూర్తి చేశారు. శిఖరంపై జాతీయ పతాకాన్ని ఎగురవేసి జాతీయ గీతాన్ని ఆలపించారు. ఈ యాత్రను దేశం కోసం ప్రాణాలర్పించిన పోలీసు అమరవీరులకు అంకితం చేశారు. క్రమశిక్షణ, పట్టుదల, మానసిక స్థైర్యంతో కఠినమైన లక్ష్యాలను సాధించవచ్చని ఆయన సాహసయాత్ర యువతకు స్ఫూర్తినిస్తుందని పలువురు పేర్కొన్నారు. వెంకటేశ్వరరావు ఘనతపై ఏలూరు జిల్లా ఎస్పీ ప్రతాప్‌ శివ కిషోర్‌, డీఎస్పీ శ్రావణ్‌ కుమార్‌తో పాటు పోలీసు శాఖ ఉన్నతాధికారులు అభినందనలు తెలిపారు. ఈ సాహసం ఆంధ్రప్రదేశ్‌కు గర్వకారణమని కొనియాడారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్