ఆదివారం, 04 అక్టోబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

మచిలీపట్నం ఉత్తర, దక్షిణ మండల ప్రజా పరిషత్‌ల ఏర్పాటు..

2 గంటల క్రితం

unchi
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 04, 2026, 06:33 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : కృష్ణా జిల్లాలోని మచిలీపట్నం రెవెన్యూ మండలాన్ని మచిలీపట్నం ఉత్తర, మచిలీపట్నం దక్షిణ మండలాలుగా విభజించిన నేపథ్యంలో రెండు మండల ప్రజా పరిషత్‌లను ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖ ఆదివారం ఉత్తర్వులు జారీ చేసింది. ఎపి పంచాయతీరాజ్‌ చట్టం ప్రకారం ఈ మేరకు నోటిఫికేషన్‌ జారీ చేశారు. ప్రస్తుతం ఉన్న మచిలీపట్నం మండల ప్రజా పరిషత్‌ను మచిలీపట్నం ఉత్తర మండల ప్రజా పరిషత్‌గా పునర్వ్యవస్థీకరించడంతో పాటు, కొత్తగా మచిలీపట్నం దక్షిణ మండల ప్రజా పరిషత్‌ను ఏర్పాటు చేశారు. మచిలీపట్నం ఉత్తర మండల ప్రజా పరిషత్‌లో 17 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. అవి అరసేపల్లి, బొర్రపోతుపాలెం, బుద్దాలపాలెం, చినకరగ్రహారం, కరగ్రహారం, చిరివెళ్లపాలెం, గోకవరం, మంగినపూడి, పొట్లపాలెం, మేకవానిపాలెం, గోపువానిపాలెం, తవిసిపూడి, పెదపట్నం, కానూరు, తాళ్లపాలెం, పోతేపల్లి, పోతిరెడ్డిపాలెం. 2011 జనాభా లెక్కల ప్రకారం ఈ మండలంలో 35,402 మంది జనాభా ఉండగా, 9 మండల పరిషత్‌ ప్రాదేశిక నియోజకవర్గాలు ఉన్నాయి. అదేవిధంగా మచిలీపట్నం దక్షిణ మండల ప్రజా పరిషత్‌లో సుల్తానాగరం, ఎస్‌.ఎన్‌.గొల్లపాలెం, సీతారాంపురం, గుండుపాలెం, రుద్రవరం, పోలాటితిప్ప, గారలదిబ్బ, కోన, పల్లె తుమ్మలపాలెం, చిన్నాపురం, నెలకుర్రు, ఎన్‌.గొల్లపాలెం, తుమ్మలచెరువు, పెదయాదర, వాడపాలెం, కె.పి.టి.పాలెం, భోగిరెడ్డిపల్లి గ్రామ పంచాయతీలు ఉన్నాయి. 2011 జనాభా లెక్కల ప్రకారం ఈ మండలంలో 33,668 మంది జనాభా ఉండగా, 11 మండల పరిషత్‌ ప్రాదేశిక నియోజకవర్గాలు ఉన్నాయి. కొత్త వ్యవస్థ 2026 అక్టోబరు 5 నుంచి అమల్లోకి రానుంది. గెజిట్‌లో నోటిఫికేషన్‌ను ప్రచురించాలని ముద్రణ, స్టేషనరీ, స్టోర్స్‌ కొనుగోలు శాఖ కమిషనర్‌ను ప్రభుత్వం ఆదేశించింది.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్