సోమవారం, 24 ఆగస్టు 2026E-PAPER
మ్యాగజైన్స్

Print Editionమండలిలో ఎవరి ఎజెండా వారిదే..

4 రోజుల క్రితం

87873346.jpg
వెబ్ డెస్క్

ప్రచురించబడింది ఆగ 19, 2026, 11:41 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : శాసన మండలిలో బుధవారం విచిత్రమైన పరిస్థితులు చోటుచేసుకున్నాయి. డిప్యూటీ ఛైర్మన్‌ ‌తూమాటి మాధవరావు ఎన్నిక ప్రకటన, అనంతరం అధ్యక్ష స్థానంలో కూర్చొబెట్టడం, తర్వాత శుభాకాంక్షలు తెలిపే కార్యక్రమాన్ని జరిగింది. వీటిని కూటమి పార్టీలకు చెందిన ఎమ్మెల్సీలు, మంత్రులు బహిష్కరించారు. తొలుత మాధవరావును ఛైర్మన్‌ ‌కొయ్యే మోషేన్‌‌రాజు, ప్రతిపక్ష నాయకుడు బొత్స సత్యనారాయణ, పలువురు వైసిపి ఎమ్మెల్సీలు అధ్యక్ష స్థానంలో కూర్చోబెట్టి అభినందనలు తెలిపారు. తరువాత కూటమి పార్టీల సభ్యులు, మంత్రులు లేకుండా అధ్యక్ష స్థానంలో ఉన్న మాధవరావు సభను నిర్వహించారు. ఈ సందర్భంగా తూమాటికి వైసిపి సభ్యులు అభినందనలు తెలిపారు. ప్రభుత్వంపై విమర్శలు చేశారు. అలాగే డిఎస్‌‌సిలో అవినీతి, అక్రమాల జరిగాయంటూ ప్రస్తావించారు. పలు అంశాలపై ప్రభుత్వాన్ని తూర్పారబట్టారు. అలాగే మండలిలో గవర్నర్‌ ‌కోటాలో ఎమ్మెల్సీగా నియమితులైన వర్ల రామయ్య ప్రమాణ స్వీకారం జరిగే సమయంలో వైసిపి సభ్యులంతా బయటకు వెళ్లిపోయారు. ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ, కూటమి ఎమ్మెల్సీలు, మంత్రులు సభలో ఉన్నారు. ప్రమాణస్వీకారం అనంతరం సభను ఛైర్మన్‌ ‌గురువారం నాటికి వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. మండలిలో మూడో రోజూ ఎటువంటి చర్చలు లేకుండానే ప్రతిష్టంభన కొనసాగింది. అంతకముందు ప్రశ్నోత్తరాలు ప్రారంభం కాగానే డిఎస్‌‌సిపై చర్చ జరపాలని వైసిపి సభ్యులు నినాదాలు చేశారు. అయితే శాసనసభలో ఆమోదించిన పలు బిల్లులు గురువారం చివరి రోజు మండలిలో ఆమోదం పొందుతాయా లేదా అన్న అంశం సర్వత్రా చర్చనీయాంశమైంది.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్