బుధవారం, 19 ఆగస్టు 2026E-PAPER
మ్యాగజైన్స్

అప్పులబాధతో రైతు ఆత్మహత్య..

31 జులై, 2026

suicide
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జులై 31, 2026, 11:47 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

​ప్రజాశక్తి-పెద్దవడుగూరు (అనంతపురం జిల్లా) : అప్పుల బాధతో రైతు ఆత్మహత్య చేసుకున్న సంఘటన అనంతపురం జిల్లా పెద్దవడుగూరు మండలంలో శుక్రవారం చోటు చేసుకుంది. పోలీసులు, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల మేరకు.. అప్పేచెర్ల గ్రామానికి చెందిన దబ్బల రమేష్ (45) తనకున్న నాలుగు ఎకరాల పొలంలో పత్తి, వేరుశనగ, మొక్కజొన్న పంటలను సాగు చేశారు. ఇందు కోసం దాదాపు రూ.పది లక్షలు అప్పులు చేశారు. పంట దిగుబడులు రాక అప్పులు తీర్చే మార్గం లేక మనోవేదనకు గురై గురువారం రాత్రి ఇంట్లో పురుగులమందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. బంధువులు చికిత్స కోసం అనంతపురం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ పరిస్థితి విషమించి రమేష్‌ శుక్రవారం మృతి చెందారు. ఆయనకు భార్య లక్ష్మీదేవి, నలుగురు కుమార్తెలు ఉన్నారు. లక్ష్మీదేవి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ రాఘవేంద్రప్ప తెలిపారు. ​

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్