ప్రజాశక్తి-పెద్దపప్పూరు (అనంతపురం జిల్లా) : విద్యుదాఘాతంతో రైతు మృతి చెందిన ఘటన అనంతపురం జిల్లా పెద్దపప్పూరు మండలం తుకపల్లి గ్రామంలో బుధవారం చోటు చేసుకుంది. పోలీసులు, మృతుని కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. తురకపల్లి గ్రామానికి చెందిన రైతు ఆదినారాయణరెడ్డి (55) బుధవారం వేకువజామున పనుల నిమిత్తం పొలానికి వెళ్లారు. అప్పటికే అక్కడ 11కెవి విద్యుత్ తీగ తెగి పడి ఉంది. గుర్తించకుండా ప్రమాదవశాత్తు దానిని తాకడంతో ఆదినారాయణరెడ్డి విద్యుదాఘాతానికి గురై అక్కడిక్కడే మృతి చెందారు. పొలానికి వెళ్లిన వ్యక్తి ఎంతసేపటికీ ఇంటికి రాక పోవడంతో కుటుంబ సభ్యులు సమీప పొలంలోని రైతులకు ఫోన్ చేశారు. దీంతో వారు గాలించగా అప్పటికే ఆదినారాయణరెడ్డి విద్యుత్ తీగ పక్కన మరణించి ఉన్నారు. మృతునికి భార్య, నలుగురు పిల్లలు ఉన్నారు. విద్యుత్ అధికారుల నిర్లక్ష్యం వల్లే ఈ ఘటన చోటు చేసుకుందని ఆదినారాయణరెడ్డి కటుంబ సభ్యులు కన్నీటి పర్యంతమయ్యారు. ఘటనా స్థలాన్ని ఎస్ఐ చంద్రశేఖర్ రెడ్డి పరిశీలించారు. మృత దేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తాడిపత్రికి తరలించి కేసు దర్యాప్తు చేస్తున్నామని ఎస్‌ఐ తెలిపారు.
విద్యుదాఘాతంతో రైతు మృతి..
48 నిమిషాల క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది సెప్టెం 10, 2026, 12:51 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్‌లు
సంబంధిత వార్తలు






కామెంట్‌లు (0)