ప్రజాశక్తి-బ్రహ్మసముద్రం : అప్పుల బాధ తాళలేక రైతు ఆత్మహత్య చేసుకుంటున్న సంఘటన అనంతపురం జిల్లా బ్రహ్మసముద్రం మండలం పిల్లలపల్లి గ్రామంలో శనివారం చోటుచేసుకుంది. కుటుంబ సభ్యులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... పిల్లలపల్లి గ్రామానికి చెందిన కూనల నాగరాజు (57) తనకున్న 2.50 ఎకరాలతో పాటు మరో ఆరు ఎకరాలను కౌలుకు తీసుకుని వేరుశనగ, టమోటా, కర్బూజా ఇతర పంటలను సాగు చేస్తున్నారు. పంట సాగు కోసం దాదాపు రూ.పది లక్షల వరకు అప్పులు చేశారు. మూడేళ్లుగా పంటలు సరిగా పండకపోవడంతో చేసిన అప్పులు తీర్చలేకపోయారు. దీంతో, మనస్తాపం చెంది శనివారం సాయంత్రం తన పొలంలోనే పురుగుల మందు తాగి ఆత్మహత్యకు యత్నించారు. గమనించిన కుటుంబ సభ్యులు చికిత్స నిమిత్తం అనంతపురం తీసుకుని వెళ్తుండగా మార్గమధ్యంలో మృతిచెందారు. ఘటనపై కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ సాయికుమార్ తెలిపారు. నాగరాజుకు భార్య నాగలక్ష్మ, కుమారుడు ఉన్నారు.
Print Editionఅప్పుల బాధతో రైతు ఆత్మహత్య...
1 గంట క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది ఆగ 29, 2026, 09:36 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్‌లు
సంబంధిత వార్తలు






కామెంట్‌లు (0)