కెఆర్ఎంబికి రాష్ట్ర ప్రభుత్వం లేఖ
ప్రజాశక్తి -అమరావతి బ్యూరో : శ్రీశైలం, నాగార్జునసాగర్ ప్రాజెక్టుల్లో నీటి వాటాలను ఖరారు చేయాలని కోరుతూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కృష్ణా నదీ యాజమాన్య బోర్డు చైర్మన్‌కు గురువారం లేఖ రాసింది. ఎల్‌నినో ప్రభావం దృష్ట్యా నీటిని జాగ్రత్తగా వాడుకోవాలని, దీనిపై చర్చించేందుకు వెంటనే బోర్డు లేదా త్రిసభ్య కమిటీ సమావేశం ఏర్పాటు చేయాలని ఎపి జలవనరులశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆ లేఖలో విజ్ఞప్తి చేశారు. శ్రీశైలం నాగార్జున సాగర్‌లో ప్రస్తుతం అందుబాటులో ఉన్న నీటిలో ఏపీ, తెలంగాణ వాటాలను స్పష్టంగా తేల్చాలని కోరారు. సింగిల్ పాయింట్ అజెండాతో (నీటి కేటాయింపులపై చర్చ) తక్షణమే సమావేశం నిర్వహించాలని కోరారు. ఎల్ నినో పరిస్థితుల రీత్యా లభ్యతను బట్టి రెండు రాష్ట్రాల నీటి వినియో గంపై తగిన నిర్ణయం తీసుకోవాలని సూచించారు. ఇప్పటికే శ్రీశైలం, సాగర్లో జలాలు తక్కువగా వున్నాయి. పై నుండి వరద నీరు వస్తున్నా ఇంకా 600 టిఎంసిల వరకు కుషన్ వుంది. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం లేఖ రాసింది.







కామెంట్‌లు (0)