ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : ఎపి మోడల్ స్కూల్స్‌లో పనిచేస్తున్న ఉద్యోగులకు ఉద్యోగ విరమణ వయోపరిమితిని 60 ఏళ్ల నుంచి 62 ఏళ్లకు పెంచుతూ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఉత్తర్వుల ప్రకారం.. ఎపి మోడల్ స్కూల్ సొసైటీ పరిధిలో పనిచేస్తున్న ఉద్యోగులు ఇకపై 62 ఏళ్ల వయసు పూర్తయ్యే నెల చివరి తేదీ మధ్యాహ్నం వరకు విధుల్లో కొనసాగవచ్చని పేర్కొంది. ఉద్యోగుల సేవా నియమావళి ఖరారయ్యే వరకు ఈ నిర్ణయం అమల్లో ఉంటుందని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఆర్థికశాఖ ఇటీవల ప్రభుత్వ ఉద్యోగుల ఉద్యోగ విరమణ వయసు పెంపునకు జారీ చేసిన మార్గదర్శకాలకు అనుగుణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొంది. ఈ ఉత్తర్వులను అమలు చేసేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని పాఠశాల విద్యాశాఖ సంచాలకుడిని ప్రభుత్వం ఆదేశించింది.
Print Editionఉద్యోగ విరమణ వయసు 62 ఏళ్లకు పెంపు
1 గంట క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది ఆగ 07, 2026, 02:00 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్‌లు
సంబంధిత వార్తలు






కామెంట్‌లు (0)