ప్రజాశక్తి-తాడేపల్లి: వైసిపి అధినేత వైఎస్ జగన్.. స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా సుసంపన్నమైన భారతదేశ నిర్మాణానికి మన వంతు కృషి చేద్దామని పిలుపునిచ్చారు. ఈ మేరకు ఆయన ఎక్స్ లో పోస్టు పెట్టారు. ‘80వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ప్రజాస్వామ్య విలువలను మరింత బలోపేతం చేసేందుకు మనల్ని మనం పునరంకితం చేసుకుందాం. మన గొప్ప దేశ నిర్మాణానికి మార్గదర్శకంగా నిలిచిన ప్రజాస్వామ్య సూత్రాలను కాపాడుతూ ముందుకు సాగుదాం. స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాల నుంచి స్ఫూర్తి పొంది, మరింత ఉజ్వలమైన, సమగ్రతతో కూడిన, సుసంపన్నమైన భారతదేశ నిర్మాణానికి మన వంతు కృషి చేద్దాం. జై హింద్! అని పోస్టు చేశారు.
సుసంపన్నమైన భారతదేశ నిర్మాణానికి మన వంతు కృషి చేద్దాం : జగన్
2 గంటల క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది ఆగ 15, 2026, 10:33 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్‌లు
సంబంధిత వార్తలు







కామెంట్‌లు (0)