ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : రాష్ట్రానికి చెందిన ఐదుగురు గ్రూప్1 అధికారులను ఐఏఎస్‌లుగా నియమిస్తూ కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన నోటిఫికేషన్‌ను రాష్ట్ర ప్రభుత్వం గెజిట్‌లో పునఃప్రచురించింది. ఈ మేరకు సాధారణ పరిపాలన శాఖ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. కేంద్ర డిపార్ట్‌మెంట్ ఆఫ్ పర్సనల్ అండ్ ట్రైనింగ్ సంస్థ జూలై 8న జారీ చేసిన నోటిఫికేషన్ ప్రకారం ఐఏఎస్‌గా పదోన్నతి పొందిన అధికారులలో ప్రభాల గోపీనాథ్, గుడిసా బాలకృష్ణ, ఎం.జయకృష్ణ, ఏ.ఏ.ఎల్. పద్మావతి, మామిళ్లపల్లి వరప్రసాద్‌లు ఉన్నారు. తదుపరి ఉత్తర్వులు వెలువడే వరకు వీరు ప్రొబేషన్‌పై కొనసాగుతారని కేంద్ర ప్రభుత్వ నోటిఫికేషన్‌లో పేర్కొన్నారు.








కామెంట్‌లు (0)