ఆదివారం, 26 జులై 2026E-PAPER
మ్యాగజైన్స్

డాబాపై నుంచి పడి ఐదేళ్ల బాలుడు మృతి

1 గంట క్రితం

death
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జులై 26, 2026, 09:30 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం

ప్రజాశక్తి-చీరాల: డాబాపై ఆడుకుంటూ ప్రమాదవశాత్తు కిందపడటంతో ఐదేళ్ల బాలుడు మృతి చెందిన హృదయవిదారక ఘటన బాపట్ల జిల్లా వేటపాలెం మండలం దేశాయిపేట పంచాయతీ ఆనుమల్లుపేటలో ఆదివారం ఉదయం జరిగింది. గ్రామానికి చెందిన మద్దెన ఏడుకొండలు, వెంకటలక్ష్మి దంపతుల కుమారుడు గణేష్ (5) స్థానిక పాఠశాలలో మొదటి తరగతి చదువుతున్నాడు. ఆదివారం ఉదయం ఇంటి డాబాపై పిట్టగోడ వద్ద ఆడుకుంటుండగా ప్రమాదవశాత్తు జారి కిందపడిపోయాడు. ఇది గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే చీరాల ఏరియా ఆస్పత్రికి తరలించగా, అప్పటికే బాలుడు మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. ఏకైక కుమారుడు మృతి చెందిన విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపించారు. క్షణాల క్రితం తమ కళ్లముందు ఆడిపాడిన చిన్నారి ఇక లేడనే వాస్తవాన్ని జీర్ణించుకోలేక వారు తీవ్ర ఆవేదనకు గురయ్యారు. ఈ ఘటనతో ఆనుమల్లుపేట గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్