మంగళవారం, 21 జులై 2026E-PAPER
మ్యాగజైన్స్

బలవంతపు నిర్బంధం ఆపాలి

12 గంటల క్రితం

sfi
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జులై 20, 2026, 11:16 అపరాహ్నం | 2 నిమిషాల చదవడం

- కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామ చేయాలి

- ఎస్ఎఫ్ఐ, డివైఎఫ్ఐ ఆధ్వర్యంలో విద్యార్థుల నిరసనలు

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : గత 21 రోజులుగా ఆమరణ నిరాహారదీక్ష‍ చేస్తున్న సోనామ్‌ వాంగ్‌ చుక్ పై జరిగిన బలవంతపు నిర్బంధం ఆపాలని, నీట్ పేపర్‌ లీకుకు కారణం అయినటువంటి కేంద్ర విద్యాశాక మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ రాజీనామ చేయాలని ఎస్ఎఫ్ఐ, డివైఎఫ్ఐ డిమాండ్ చేశాయి. విజయవాడలోని ఎస్ఆర్ఆర్‌ కళాశాల నుంచి బిఎస్ఎన్‌ఎల్ ఆఫీసు వరకు వందలాది మంది విద్యార్థులు సోమవారం ర్యాలీ, నిరసన కార్యక్రమంలో పాల్గోన్నారు. ఈ సందర్భంగా ఎస్‌ఎఫ్ఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రసన్న కుమార్ మాట్లాడుతూ.. 22 మంది విద్యార్థుల ఆత్మహత్యలకు ముఖ్యకారణం ధర్మేంద్ర ప్రధాన్ అని అన్నారు. వాంగ్ చుక్‌ ఆమరణ నిరాహారదీక్ష‍ చేస్తూవుంటే దానికి సమాదానం చెప్పకుండా నిర్భందించి, దీక్ష‍ను మధ్యాంతరంగా ఆపివేసి బలవంతంగా ఆసుపత్రికి తరలించడం అన్యాయమన్నారు. ఢిల్లీ నడిబొడ్డున విద్యార్థులు, జెన్‌ జి కలిసి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామ చేయాలని, విద్యారంగంలో సంస్కరణ తీసుకురావలని సోమవారం చేస్తున్నటువంటి పార్లమెంట్ మార్చ్ కు దేశవ్యాప్తంగా ఎస్ఎఫ్ఐ మద్దతు నిరసన కార్యక్రమాలు చేపట్టినట్లు తెలిపారు. నేషనల్ టెస్టింగ్ ఎజెన్సి (ఎన్‌టిఏ) లీకేజ్‌ ఎజెన్సి అని దీన్ని వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. పార్లమెంట్‌లో ఈ రాష్ట్రంలోని కూటమి, వైసిపి ప్రభుత్వాల ఎంపిలు ఈ ఘటనపై మాట్లాడాలని డిమాండ్ చేశారు. డివైఎఫ్ఐ రాష్ట్ర కార్యదర్శి జి.రామన్న మాట్లాడుతూ… 24 లక్ష‍ల మంది విద్యార్థుల జీవితాలతో చెలగాటం ఆడినటువంటి కేంధ్ర విద్యాశాఖ మంత్రిని బెర్తఆఫ్ చేయాలని దేశవ్యాప్తంగా విద్యార్థిలోకమంతా గట్టిగా పోరాడతుంటే, ఈ దేశ ఐక్యత కోసం నిలబడినటువంటి సోనాంమ్ వాంగ్ చుక్ 21 రోజులు పాటు నిర్వదిక దీక్ష‍లు చేస్తూవుంటే ప్రధాన మంత్రికి, కేంద్ర ప్రభుత్వానికి దీనిపై చర్చించడానికి ఒక్క క్ష‍ణం తీరిక లేదన్నారు. ఒక వైపు కార్పరేట్లకు సంపదంతా దోచిపెడుతూ..మరో వైపు లీకేజీ స్టార్ల్ ను కాపాడుతున్నారు అని అన్నారు. నరేంద్ర మోడీ ‘దోంగలవైపు ఉంటావా విద్యార్థులవైపు ఉంటావా’ అని ప్రశ్నించారు. ఇప్పటికైనా మౌనమునిగా ఉండకుండా నోరు విప్పి మాట్లాడాలని, తన మంత్రి శాఖలో ఉన్న విద్యాశాఖ మంత్రిని రాజీనామా చేయించాలన్నారు.

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్