గురువారం, 09 జులై 2026E-PAPER
మ్యాగజైన్స్

Print Editionహాకర్ల బలవంతపు తొలగింపు ఆపాలి : సిఐటియు

2 గంటల క్రితం

citu
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జులై 09, 2026, 11:22 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

ప్రజాశక్తి - అమరావతి బ్యూరో :విజయవాడ నగరంలోని బీసెంట్ రోడ్‌‌లో దశాబ్ధాల తరబడిగా వివిధ రకాల వస్తువులు అమ్ముకుంటూ జీవనం సాగిస్తున్న వందలాది మంది పేద హాకర్లను తొలగించే ప్రయత్నాలను మానుకోవాలని సిఐటియు రాష్ట్ర కమిటీ డిమాండ్‌ ‌చేసింది. గతంలో రాష్ట్ర ప్రభుత్వం వీరి వ్యాపారాన్ని ప్రోత్సహించడానికి తక్కువ వడ్డీకి రుణాలు మంజూరు చేసిందని సిఐటియు రాష్ట్ర అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు సి.హెచ్‌ ‌నర్సింగరావు, ఎవి నాగేశ్వరరావు గురువారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు స్మార్ట్ సిటీల పేరుతో తీసుకువచ్చిన విధానం వల్ల నగరాల్లో ప్రభుత్వ ఉపాధి కల్పించకపోయినా దువ్వెనలు, ఫ్యాన్సీ ఐటమ్స్ తక్కువ ధరలకు విక్రయిస్తూ జీవనం సాగిస్తున్న చిరు వ్యాపారులు, నిరుపేదలపై ప్రభుత్వ ప్రోత్సాహంతో నగరపాలక సంస్థ అధికారులు వందలాది మంది పోలీసులతో దౌర్జన్యానికి పాల్పడి, అక్కడి నుండి తొలగించడాన్ని తీవ్రంగా ఖండించారు. నగరాల్లో, పట్టణాల్లో హాకర్లకు ఎక్కడైతే ఉపాధి పొందుతున్నారో ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా అక్కడే వారికి ఉపాధి కల్పించే విధంగా చర్యలు తీసుకోవాలని సుప్రీంకోర్టు ఆదేశించిందన్నారు. తప్పని సరైతే వారికి ప్రత్యామ్నాయ స్థలం కేటాయించిన తరువాత మాత్రమే అది కూడా వారి ఉపాధి దెబ్బతినకుండా మార్చాలని ఆదేశించిందని వెల్లడించారు. విజయవాడ నగరపాలక సంస్థ అధికారులు దౌర్జన్యంగా హాకర్స్‌ని తొలగించే ప్రయత్నం చేయడాన్ని సిఐటి యు రాష్ట్ర కమిటీ తీవ్రంగా ఖండిస్తోందన్నారు. ఈ నిర్ణయాన్ని ఉపసంహ రించుకోవాలని కోరారు. బీసెంట్ రోడ్‌లో హాకర్లు ఇప్పటికే కార్పొరేషన్ల గుర్తింపు కార్డులు పొంది మున్సిపాల్టీ టాక్స్ కడుతున్నారని పేర్కొన్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్