ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : పాఠశాల విద్యార్ధులకు ఫార్మెటీవ్ అసెస్మెంట్(ఎఫ్ఎ)-1 పరీక్షలు ఈ నెల 17 నుంచి ప్రారంభం కానున్నాయి. ఇందుకు సంబందించిన షెడ్యూల్ ను పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ తమీమ్ అన్సారియా శనివారం విడుదల చేశారు. ఈ పరీక్షలు ముందుగా ఈ నెల 3 నుంచి 6వ తేది వరకు జరుగుతున్నాయని అకడమిక్ క్యాలెండర్ లో విద్యాశాఖ ప్రాధమికంగా ప్రకటించింది. ఇప్పుడు ఈ నెల 17 నుంచి జరుగుతున్నాయని డైరెక్టర్ వెల్లడించారు. ప్రాథమిక తరగతుల విద్యార్ధులకు ఈ నెల 19వ తేది వరకు, 6 నుంచి 10వ తరగతి విద్యార్ధులకు 20వ తేది వరకు జరుగుతాయని పేర్కొన్నారు. ప్రాథమిక విద్యార్ధుల ప్రశ్నపత్రాలను స్కూల్ కాంప్లెక్స్ లో, 6 నుంచి 10వ తరగతి విద్యార్ధుల ప్రశ్నపత్రాలను మండల రిసోర్స్ కేంద్రాల్లో భద్రపరచాలని ప్రాంతీయ, జిల్లా విద్యాశాఖ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.
17 నుంచి ఫార్మెటివ్-1 పరీక్షలు
01 ఆగస్టు, 2026

వెబ్ డెస్క్
ప్రచురించబడింది ఆగ 01, 2026, 09:16 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్‌లు
సంబంధిత వార్తలు






కామెంట్‌లు (0)