ప్రజాశక్తి - సోంపేట (శ్రీకాకుళం జిల్లా) : మాజీ మంత్రి, వైసిపి నాయకులు సీదిరి అప్పలరాజుకు శ్రీకాకుళం జిల్లా సోంపేట ఆరో అదనపు జిల్లా కోర్టు శుక్రవారం బెయిల్ మంజూరు చేసింది. దీంతో ఆయన జైలు నుంచి విడుదలయ్యారు. ఆయన కుమారుడు ఆరవ్ వర్మ గత నెల పదో తేదీన కాశీబుగ్గలో బైక్‌తో ఢీకొట్టడంతో గొర్రెల కాపరి మృతి చెందిన ఘటనలో సాక్ష్యాధారాలను తారుమారు చేశారన్న ఆరోపణలతో గత నెల 22న పోలీసులు అప్పలరాజును అరెస్టు చేశారు. 23న రిమాండ్‌కు తరలించడంతో, అప్పట్నుంచీ ఆయన అంపోలు జైలులో ఉన్నారు. అప్పలరాజు బెయిల్ కోసం మూడుసార్లు సోంపేట కోర్టును ఆశ్రయించగా, గతంలో పిటిషన్‌పై విచారణలు, వాయిదాలు కొనసాగాయి. నాలుగోసారి బెయిల్ పిటిషన్‌పై విచారణ చేపట్టిన న్యాయస్థానం ఆయనకు బెయిల్ మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
దీంతో, ఆయన శుక్రవారం జైలు నుంచి విడుదలయ్యారు. అనంతరం మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు క్యాంపు కార్యాలయంలో అప్పలరాజు విలేకరుల సమావేశంలో మాట్లాడారు. టిడిపి కూటమి ప్రభుత్వం రెడ్ బుక్ రాజ్యాంగంలో భాగంగానే తనతో పాటు తన కుమారుడినీ అరెస్టు చేయించిందని, కక్షసాధింపు రాజకీయాలు చేస్తోందని విమర్శించారు.








కామెంట్‌లు (0)