నేడు ఆయుష్ మెడికల్ కళాశాలకు భౌతికకాయం అప్పగింత
ప్రజాశక్తి - విజయవాడ అర్బన్, అమరావతి బ్యూరో : ప్రముఖ పబ్లిషర్, విజయవాడ పుస్తకమహోత్సవ సంఘ పూర్వ అధ్యక్షులు బెల్లపు బాబ్జీ (78) మరణించారు. గత కొద్దికాలంగా కాలేయ సంబంధ సమస్యలతో బాధపడుతూ చికిత్స తీసుకుంటున్నారు. పరిస్థితి విషమించడంతో గురువారం ఉదయం కన్నుమూశారు. ఆయనకు భార్య, ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. భౌతికకాయాన్ని రామవరప్పాడు సమీపంలో వైస్ఎల్వీ అమరావతీగ్రాండ్-1లోని ఆయన స్వగృహంలో ఉంచారు. వైద్య విద్యార్థుల ఉపయోగార్థం శుక్రవారం ఆయుష్ మెడికల్ కళాశాల ఆసుపత్రికి భౌతికకాయాన్ని అప్పగించారు. 2015-16, 2016-17 కాలంలో విజయవాడ బుక్ ఫెస్టివల్ అధ్యక్షునిగా, 2018 నుండి 2024 వరకూ గౌరవాధ్యక్షులుగా పని చేశారు.
జెవివి సంతాపం
బెల్లపు బాబ్జీ గారి మృతి పట్ల జన విజ్ఞాన వేదిక రాష్ట్ర అధ్యక్షులు, మాజీ ఎమ్మెల్సీ కె.ఎస్ లక్ష్మణరావు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తవ్వ సురేష్ సంతాపం వ్యక్తం చేశారు. విజయవాడ బుక్ ఫెస్టివల్ నిర్వహణలో ఎదురైన పలు సవాళ్లను అధికామించడానికి బాబ్జి ఎంతో కృషి చేశారనీ, వ్యవస్థాపక సభ్యుడి నుండి గౌరవాధ్యక్ష బాధ్యతల వరకు సమర్ధవంతంగా నిర్వహించారని గురువారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. బాబ్జీ భౌతీక కాయాన్ని కుటుంబ సభ్యులు పరిశోదనలకు అప్పగించడం ఒక మంచి ఆలోచన అని లక్ష్మణరావు, సురేష్ పేర్కొన్నారు. జనవిజ్ఞాన వేదిక రాష్ట్ర ఉపాధ్యక్షులు కె శ్రీనివాస్ బాబ్జి భౌతిక కాయాన్ని సందర్శించి నివాళి అర్పించారు.







కామెంట్‌లు (0)