ఆదివారం, 18 అక్టోబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

వినుకొండ మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు హౌస్‌ అరెస్ట్‌

54 నిమిషాల క్రితం

house arest.jpeg
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 18, 2026, 09:32 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం

  • మున్సిపల్‌ చైర్మన్‌ అభ్యర్థి నామినేషన్‌ నేపథ్యంలో పోలీసుల చర్య

ప్రజాశక్తి-వినుకొండ : వినుకొండ మున్సిపల్‌ చైర్మన్‌ పదవికి వైసీపీ తరఫున పీఎస్‌ ఖాన్‌ ఆదివారం నామినేషన్‌ దాఖలు చేయనున్న నేపథ్యంలో, వినుకొండ మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడును పోలీసులు హౌస్‌ అరెస్ట్‌ చేశారు. నరసరావుపేటలోని ఆయన నివాసంలో ఈ చర్య చేపట్టారు. నామినేషన్‌ ప్రక్రియకు ముందు మాజీ ఎమ్మెల్యేను హౌస్‌ అరెస్ట్‌ చేయడం రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీసింది. ఈ సందర్భంగా బొల్లా బ్రహ్మనాయుడు పోలీసులను ప్రశ్నించినట్లు తెలిపారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో అభ్యర్థులు నామినేషన్‌ దాఖలు చేసే హక్కుకు ఆటంకాలు ఎందుకు కల్పిస్తున్నారని ఆయన ప్రశ్నించారు. ప్రతిపక్ష నాయకులను అడ్డుకోవడం సరికాదని బ్రహ్మనాయుడు పేర్కొన్నారు. ఎన్నికల ప్రక్రియ స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా జరిగేలా అధికారులు చర్యలు తీసుకోవాలని కోరారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్