ఆదివారం, 18 అక్టోబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

కోల్‌కతా తొక్కిసలాటలో 19కి చేరిన మృతుల సంఖ్య..

1 గంట క్రితం

9ffmgde_kolkata-durga-puja-stampede-updates_625x300_17_October_26.webp
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 18, 2026, 09:42 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం

  • మృతుల కుటుంబాలకు రూ.2 లక్షల పరిహారం ప్రకటించిన ప్రధాని మోడీ

కోల్‌కతాలో దుర్గాదేవి మండపం వద్ద జరిగిన తొక్కిసలాట తీవ్ర విషాదాన్ని నింపింది. ఈ ఘటనలో మృతుల సంఖ్య 19కి చేరింది. ఇరుకైన ప్రవేశ, నిష్క్రమణ మార్గాలు, భారీగా తరలివచ్చిన జనసందోహం, అకస్మాత్తుగా కురిసిన వర్షం ఈ ప్రమాదానికి కారణాలుగా తెలుస్తోంది. వర్షం కారణంగా మండపంలో ఉన్నవారు బయటకు వెళ్లేందుకు ఇబ్బందులు ఎదుర్కోగా, బయట ఉన్నవారు లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించడంతో పరిస్థితి అదుపుతప్పి తొక్కిసలాట జరిగినట్లు క్షతగాత్రులు పేర్కొన్నారు. ఈ ఘటనలో పలువురు గాయపడగా, వారికి చికిత్స అందిస్తున్నారు. ఈ దుర్ఘటనపై ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు రూ.2 లక్షలు, గాయపడిన వారికి రూ.50 వేల చొప్పున పరిహారం ప్రకటించారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్