ప్రజాశక్తి – బూర్జ: శ్రీకాకుళం జిల్లా బూర్జ మండలంలోని అల్లిని పంచాయతీ పరిధి తిలంతర గ్రామం సమీపంలో నాగావళి నదిలో గుర్తుతెలియని మహిళ మృతదేహం ఆదివారం ఉదయం ఒడ్డుకు కొట్టుకొచ్చింది. వేకువజామున నది వద్దకు వెళ్లిన స్థానికులు మృతదేహాన్ని గుర్తించి సంబంధిత అధికారులకు సమాచారం అందించారు. మృతురాలి వివరాలు, ఆమె ఏ ప్రాంతానికి చెందినవారన్నది తెలియాల్సి ఉంది. ఘటనపై అధికారులు విచారణ చేపట్టిన అనంతరం మరిన్ని వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉంది.
నాగావళిలో గుర్తుతెలియని మహిళ మృతదేహం లభ్యం
1 గంట క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది అక్టో 18, 2026, 10:12 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్లు
సంబంధిత వార్తలు







కామెంట్లు (0)