బుధవారం, 29 జులై 2026E-PAPER
మ్యాగజైన్స్

Print Edition17 నుంచి భోగాపురం ఎయిర్‌‌పోర్టులో పూర్తిస్థాయి సేవలు

1 గంట క్రితం

Centre approves release of pending Kharif season insurance dues.
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జులై 29, 2026, 11:33 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

  • మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు

ప్రజాశక్తి-భోగాపురం : ఆగస్టు ఒకటిన ఎయిర్ పోర్టు ప్రారంభోత్సవంతో ఉత్తరాంధ్ర ప్రజల కలలు సాకారం కానున్నాయని రాష్ట్ర వ్యవసాయ, అనుబంధ శాఖల మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు తెలిపారు. రాష్ట్ర ఎంఎస్ఎంఇ సెర్ప్ శాఖమంత్రి కొండపల్లి శ్రీనివాస్ తో కలిసి మంత్రి అచ్చెన్నాయుడు బుధవారం భోగాపురం ఎయిర్ పోర్టు వద్ద పాత్రికేయుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి అచ్చెన్నాయుడు మాట్లాడుతూ... ఆగస్టు ఒకటిన భోగాపురంలోని అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రారంభిస్తారని, 17 నుంచి పూర్తి స్థాయిలో ఈ ఎయిర్‌‌పోర్టు అందుబాటులోకి వస్తుందని తెలిపారు. 16 రాత్రి సింగపూర్ నుంచి విమానం వచ్చి, 17 తెల్లవారుజామున ఇక్కడినుంచి బయలుదేరుతుందని వివరించారు. అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయానికి భూములిచ్చిన రైతులకు అన్నివిధాలా న్యాయం చేస్తామని, వారికి విమాన ప్రయాణాన్ని కల్పించి గౌరవిస్తామని తెలిపారు. డిఎస్‌‌సి పరీక్షలు అత్యంత పకడ్బందీగా, పారదర్శకంగా జరిగాయని, దీనిపై ప్రతిపక్షం చేస్తున్న ఆరోపణలను కొట్టి పడేశారు. గత ప్రభుత్వ హయాంలో ఈ ప్రాంతానికి తీరని అన్యాయం జరిగిందని విమర్శించారు._అనంతరం విమానాశ్రయాన్ని రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ పరిశీలించారు. మౌలిక వసతుల పనుల పురోగతిని అధికారులను అడిగి తెలుసుకున్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్