బుధవారం, 12 ఆగస్టు 2026E-PAPER
మ్యాగజైన్స్

Print Editionజూనియర్ వైద్యుల సమ్మెకు సంపూర్ణ మద్దతు

2 గంటల క్రితం

sfi
వెబ్ డెస్క్

ప్రచురించబడింది ఆగ 12, 2026, 09:54 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

  • న్యాయమైన డిమాండ్లను వెంటనే పరిష్కరించాలి : ఎస్ఎఫ్‌ఐ

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో ​: న్యాయమైన డిమాండ్ల సాధన కోసం ఆంధ్రప్రదేశ్ జూనియర్ డాక్టర్స్ అసోసియేషన్ (జూడా) చేపట్టిన సమ్మెకు భారత విద్యార్థి ఫెడరేషన్ (ఎస్ ఎఫ్ఐ) రాష్ట్ర కమిటీ సంపూర్ణ మద్దతు ప్రకటించింది. జూనియర్ వైద్యుల డిమాండ్లను ప్రభుత్వం వెంటనే పరిష్కరించి, సమ్మెను విరమించేలా చొరవ తీసుకోవాలని ఎస్ఎఫ్‌ఐ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు పి రామ్మోహన్, కె ప్రసన్న కుమార్ బుధవారం ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు. ప్రభుత్వ వైద్య కళాశాలలు, బోధనాస్పత్రుల్లో ఇంటర్న్‌లు, జూనియర్ రెసిడెంట్లు, సూపర్ స్పెషాలిటీ పోస్టు గ్రాడ్యుయేట్లు వేలాది మంది తీవ్ర ఒత్తిడితో విధులు నిర్వహిస్తున్నారని తెలిపారు. రోగులకు నిరంతరం వైద్య సేవలు అందిస్తూ ప్రజల ప్రాణాలను కాపాడుతున్న యువ వైద్యుల శ్రమకు తగిన విధంగా స్టైఫండ్‌‌ను పెంచాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. తమ సమస్యల పరిష్కారం కోసం జూనియర్ వైద్యులు ప్రభుత్వంతో చర్చలు జరిపినప్పటికీ స్పష్టమైన హామీ లభించకపోవడం బాధాకరమని పేర్కొన్నారు. వైద్య విద్యార్థులు, యువ వైద్యుల సమస్యలను నిర్లక్ష్యం చేస్తే ప్రభుత్వ వైద్య వ్యవస్థపై ప్రతికూల ప్రభావం పడే ప్రమాదం ఉందని హెచ్చరించారు. అత్యవసర, ఐసియు సేవలకు అంతరాయం కలగకుండా జూనియర్ వైద్యులు తమ నిరసన కొనసాగిస్తున్నారని తెలిపారు. వారి పోరాటాన్ని ప్రభుత్వం సానుకూలంగా పరిగణించి, న్యాయమైన డిమాండ్లను వెంటనే అంగీకరించాలని కోరారు. జూనియర్ వైద్యులపై ఎలాంటి నిర్బంధ చర్యలు తీసుకోకుండా వారి ప్రతినిధులతో తక్షణమే చర్చలు జరిపి సమస్యను సామరస్యంగా పరిష్కరించాలని డిమాండ్ చేశారు.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్