ప్రజాశక్తి-అమరావతి బ్యూరో: రాష్ట్రంలో పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు సంబంధించి పర్యవేక్షణాధికారుల నియామకాల్లో ప్రభుత్వం మార్పులు చేసింది. ఇందులో భాగంగా పలాస-కాశీబుగ్గ మున్సిపాలిటీ పర్యవేక్షణాధికారిగా శ్రీకాకుళం మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ జి శ్రవణ్‌కుమార్‌ను నియమించింది. ఇప్పటివరకు ఆయన పార్వతీపురం మున్సిపాలిటీ పర్యవేక్షణాధికారిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఆయన స్థానంలో పార్వతీపురం మున్సిపాలిటీ పర్యవేక్షణాధికారిగా అమలాపురం అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ పరిపాలనాధికారి ఎం రవిసుధాకర్ను నియమించింది. ఈ మేరకు రాష్ట్ర మున్సిపల్ పరిపాలన, పట్టణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి ఎస్ సురేశ్‌కుమార్ ఆదివారం ఉత్తర్వులు జారీచేశారు.
పలాస-కాశీబుగ్గ మున్సిపాలిటీ పర్యవేక్షణాధికారిగా జి శ్రవణ్‌కుమార్
1 గంట క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది అక్టో 18, 2026, 10:00 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్లు
సంబంధిత వార్తలు






కామెంట్లు (0)