- భారత వాతావరణ సంస్థ
ప్రజాశక్తి-అమరావతి బ్యూరో: పశ్చిమ మధ్య బంగాళాఖాతం, దానిని ఆనుకుని ఉన్న దక్షిణ ఆంధ్రప్రదేశ్, తమిళనాడు తీర ప్రాంతాల వద్ద ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం వెల్లడించింది. మరోవైపు లక్షద్వీప్ నుంచి కర్ణాటక, దక్షిణ ఆంధ్రప్రదేశ్ మీదుగా పశ్చిమ మధ్య బంగాళాఖాతం వరకు ద్రోణి విస్తరించి ఉందని ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొంది. వీటి ఫలితంగా కోస్తా ఆంధ్ర, యానాం, రాయలసీమల్లో పలుచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కురిసే అవకాశం ఉందని, ఒకటి లేదా రెండు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశముందని తెలిపింది. అలాగే, అక్కడక్కడ ఉరుములతో కూడిన మెరుపులు సంభవించవచ్చని హెచ్చరించింది. గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో, గరిష్ఠంగా గంటకు 60 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీచే అవకాశం ఉందని పేర్కొంది.







కామెంట్లు (0)