mh ad
శుక్రవారం, 19 జూన్ 2026E-PAPER
మ్యాగజైన్స్

8, 9, 10 తరగతుల కుదింపుపై ధర్నా

8 గంటల క్రితం

girijana
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జూన్ 19, 2026, 01:34 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం

​ప్రజాశక్తి - పోలవరం: గిరిజన విద్యార్థుల భవిష్యత్తుతో చెలగాటమాడొద్దని, ఇటుకలకోటలోని గిరిజన సంక్షేమ ఆశ్రమ ఉన్నత బాలుర పాఠశాలలో 8, 9, 10 తరగతులను కుదించాలనే ప్రభుత్వ నిర్ణయంపై గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ గురువారం గ్రామస్తులు పాఠశాల గేట్లకు తాళాలు వేసి ధర్నా నిర్వహించారు. పలువురు గ్రామస్తులు మాట్లాడుతూ... రెండు రోజుల క్రితం ఉన్నతాధికారులు పాఠశాల సిబ్బందికి ఫోన్ చేసి 8,9, 10 తరగతుల విద్యార్థులకు టీసీలు ఇచ్చి పంపించాలని సూచించడంతో తరగతుల రద్దు విషయం వెలుగులోకి వచ్చిందన్నారు. రేషనలైజేషన్ పేరుతో పాఠశాల స్థాయిని తగ్గించి మూడో తరగతి నుంచి ఏడో తరగతి వరకు మాత్రమే కొనసాగించనున్నట్లు, 8, 9, 10 తరగతుల విద్యార్థులను సుమారు పది కిలోమీటర్ల దూరంలో ఉన్న చేగొండపల్లి ఆశ్రమ పాఠశాలకు తరలించాలని నిర్ణయించినట్లు తెలిసిందన్నారు. పిల్లలు పుట్టినప్పటి నుంచి ఇదే పాఠశాలలో చదువుతున్నారని, వారిని అకస్మాత్తుగా వేరే ప్రాంతానికి పంపించడం వల్ల అనేక ఇబ్బందులు ఎదురవుతాయని వారు ఆవేదన వ్యక్తం చేశారు. తాము రోజువారీ పనులు చేసుకుని జీవించేవారమని, పిల్లలను దూర ప్రాంతాలకు తీసుకెళ్లడం సాధ్యం కాదన్నారు. ఈ పాఠశాలలో బోధన, వసతులు, భోజనం నాణ్యతలో ఎటువంటి లోటుపాట్లూ లేవని, అయినప్పటికీ తరగతులను తొలగించాల్సిన అవసరం ఏమిటని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఒకటో తరగతి నుంచి పదో తరగతి వరకు పాఠశాలను యథావిధిగా కొనసాగించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో మాజీ ఎంపిటిసి సభ్యులు సున్నం గంగాజలం, తామా బాలరాజు, ధర్ముల లక్ష్మి, పోసి రత్నం, ఇందిరావతి, సుధారాణి, వెంకటలక్ష్మి, రామకృష్ణ, గ్రామస్తులు పాల్గొన్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్