న్యూఢిల్లీ : సోషల్ మీడియా వేదికల్లో డీప్‌ఫేక్ వీడియోలు, బాలలపై లైంగిక వేధింపులకు సంబంధించిన మెటీరియల్ (సీఎస్‌ఏఎం)పై కేంద్ర ప్రభుత్వం ఆందోళన వ్యక్తం చేసింది. ఈ అంశాలపై మెటా ప్రతినిధులతో కేంద్ర అధికారులు చర్చలు జరిపారు. డీప్‌ఫేక్ కంటెంట్‌ను అడ్డుకునేందుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. సోషల్ మీడియా వేదికల్లోని కంటెంట్‌కు ఆయా సంస్థలే బాధ్యత వహించాలని స్పష్టం చేశారు. భారత చట్టాలకు అనుగుణంగా మెటా వేదికలు పనిచేస్తున్న తీరుపై అధికారులు ఆరా తీశారు. ఇన్‌స్టాగ్రామ్ కంటెంట్ రికమండేషన్ అల్గోరిథమ్‌లపైనా వివరాలు అడిగి తెలుసుకున్నారు. డీప్‌ఫేక్ కంటెంట్‌ను నిలువరించేందుకు పలు పరిష్కారాలు తమ వద్ద ఉన్నాయని మెటా ప్రతినిధులు తెలిపారు. ఈ సమావేశాల ఫలితాలను సమీక్షించిన అనంతరం తదుపరి చర్యలపై కార్యాచరణ ప్రకటిస్తామని కేంద్ర అధికారులు తెలిపారు. ఇతర సోషల్ మీడియా వేదికలు భారత చట్టాలను పాటిస్తున్నాయా లేదా అన్నదానిపైనా పరిశీలన కొనసాగుతున్నట్లు వెల్లడించారు. ప్రధాని మోడి వీడియో సందేశాన్ని ఫేస్‌బుక్ కొన్ని గంటల పాటు నిలిపివేసిన ఘటనకు సంబంధించి సమన్లు జారీ కావడంతో మెటా ప్రతినిధుల బృందం భారత్‌కు వచ్చిన నేపథ్యంలో ఈ చర్చలు జరిగాయి.
మీ కంటెంట్ కు మీరే బాధ్యులు : మెటాకు కేంద్రం ఆదేశాలు
1 గంట క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది ఆగ 08, 2026, 01:02 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్‌లు
సంబంధిత వార్తలు






కామెంట్‌లు (0)