సోమవారం, 14 సెప్టెంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపిన గవర్నర్‌, సిఎం

10 గంటల క్రితం

cm
వెబ్ డెస్క్

ప్రచురించబడింది సెప్టెం 13, 2026, 10:07 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : గవర్నర్‌ అబ్దుల్‌ ‌నజీర్‌ , ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాష్ట్ర ప్రజలకు ‌విడివిడిగా వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపారు. కుటుంబ సభ్యులందరూ ఎలిసి ఎంతో ఉత్సాహంతో, భక్తి భావం, ఆందోత్సాహాలతో జరుపుకునే పండుగ వినాయక చవితి అని అబ్దుల్‌ ‌నజీర్‌ ఒక ప్రకటనలో తెలిపారు. అందరం శాంతి, సౌభాగ్యం, సామరస్యంతో కూడిన జీవితాన్ని గడిపేలా విఘ్నేశ్వరుడు ఆశీస్సులను అందించాలని ప్రార్ధించారు. అన్ని వర్గాల ప్రజలను ఒక్కచోట చేర్చే గొప్ప సామాజిక పండుగ వినాయక చవితి అని చంద్రబాబు నాయుడు మరో ప్రకటనలో తెలిపారు. ఊళ్లు, కాలనీలు, పట్టణాలు, నగరాలు అనే తేడా లేకుండా వాడవాడలా అన్ని వర్గాలు ఎంతో ఘనంగా నిర్వహిస్తారని పేర్కొన్నారు.మట్టి వినాయక ప్రతిమలను పూజిస్తూ, పర్యావరణాన్ని పరిరక్షిస్తూ సంస్కృతి, సంప్రదాయాలను మరింత వైభవంగా కొనసాగిద్దామని కోరారు. వినాయక చవితి వేడుకలను పర్యావరణహితంగా నిర్వహించుకోవాలని ఉపముఖ్యమంత్రి పవన్‌ ‌కళ్యాణ్‌ ‌మరో ప్రకటనలో కోరారు. సంప్రదాయబద్ధంగా మట్టి వినాయకుడిని పూజించి పర్యావరణాన్ని పరిక్షించుకుందామని తెలిపారు. వినాయకచవితి సందర్భంగా రాష్ట్రప్రజలందరికీ సకల శుభాలూ కలగాలని, విజయాలు సాధించాలని, ప్రతి కుటుంబం సుఖ సంతోషాలతో అభివృద్ధి చెందాలని మాజీముఖ్యమంత్రి వైఎస్‌ ‌జగన్‌‌మోహన్‌ ‌రెడ్డి కోరారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్