ఆదివారం, 26 జులై 2026E-PAPER
మ్యాగజైన్స్

Print Editionపవన్ కల్యాణ్‌‌కు గవర్నర్ పరామర్శ

16 జులై, 2026

pavan
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జులై 16, 2026, 11:07 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : కుడి భుజానికి శస్త్ర చికిత్స చేయించున్న ఉప ముఖ్యమంత్రి కె.పవన్‌ ‌కల్యాణ్‌‌ను గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ పరామర్శించారు. గవర్నర్ హైదరాబాద్ లోని ఉపముఖ్యమంత్రి నివాసానికి గురువారం ఉదయం విచ్చేశారు. శస్త్ర చికిత్స అనంతరం ఆరోగ్య పరిస్థితి గురించి పవన్‌ ‌కల్యాణ్‌‌ను అడిగి తెలుసుకున్నారు. వైద్య నిపుణుల సూచనలు పాటించాలని చెప్పారు. త్వరగా కోలుకుని, సంపూర్ణ ఆరోగ్యంతో విధుల్లోకి రావాలని ఆకాంక్షించారు. ఆయన స్వగృహంలో ఉన్న లైబ్రరీని గవర్నర్ తిలకించారు. లైబ్రరీలోని పలు పుస్తకాలను పరిశీలించారు. ప్రఖ్యాత రచయితలు, స్కాలర్స్, విశ్లేషకులు, పబ్లిక్ పాలసీ మేకర్స్ రాసిన పుస్తకాలు పరిశీలించారు. ఉపముఖ్యమంత్రి కోరడంతో ఓ పుస్తకంపై గవర్నర్‌ ఆటోగ్రాఫ్ చేశారు.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్