మంగళవారం, 22 సెప్టెంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

Print Editionవైభవంగా శ్రీవారి రథోత్సవం

47 నిమిషాల క్రితం

ttd
వెబ్ డెస్క్

ప్రచురించబడింది సెప్టెం 22, 2026, 11:05 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

ప్రజాశక్తి - తిరుమల : తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో ఎనిమిదో రోజైన మంగళవారం ఉదయం 7 గంటలకు ఉభయదేవేరులతో కూడిన శ్రీమలయప్పస్వామివారి రథోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. వేలాది మంది యాత్రికులు పాల్గొని రథాన్ని లాగారు. బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఉభయదేవేరులతో కూడిన శ్రీమలయప్పస్వామివారిని మహోన్నత రథంపై అధిష్ఠింపజేసి తిరుమాడ వీధుల్లో ఊరేగించారు. ఈ కార్యక్రమంలో తిరుమల పెద్దజీయర్‌స్వామి, తిరుమల చిన్నజీయర్‌స్వామి, టిటిడి చైర్మన్‌ ‌బిఆర్‌ నాయుడు, ఇఒ ముద్దాడ రవిచంద్ర, పలువురు బోర్డు సభ్యులు, అదనపు ఇఒ సిహెచ్‌ వెంకయ్య చౌదరి, ‌జెఇఒ డా ఎ శరత్, ఎస్‌‌పి ఎల్‌ సుబ్బరాయుడు, సివిఎస్‌ఒ మురళీకృష్ణ, ఎస్‌‌విబిసి చైర్మన్ శ్రీధర్ వర్మ, ఇంజనీరింగ్ అధికారులు తదితరులు పాల్గొన్నారు.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్