ఆదివారం, 13 సెప్టెంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

గొర్రెలకు మేతగా వేరుశనగ పంట

1 గంట క్రితం

singana .jpg
వెబ్ డెస్క్

ప్రచురించబడింది సెప్టెం 13, 2026, 07:02 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం

  • కళ్లేదుటే రైతు కష్టం ఆవిరి

ప్రజాశక్తి-శింగనమల : అనంతపురం జిల్లాలో రైతులు ఎంతటి కరువు కోరల్లో చిక్కుకున్నారు అనేందుకు ఉదాహరణ పై ఫొటో. వర్షాభావంతో ఎండిపోయిన వేరుశగ పంట మొత్తాన్ని ఓ రైతు గొర్రెల మేతగా ఇచ్చేశాడు. ఖరీఫ్‌ ‌ప్రారంభంలో వచ్చిన వర్షానికి కొందరు రైతులు అక్కడక్కడ వేరుశనగ విత్తనాలు వేశారు. విత్తనం వేసింది మొదలు ఆ తర్వాత ఒక్కసారిగా కూడా వర్షం కురవలేదు. దీంతో మొలకెత్తిన వేరుశనగ పంట మొత్తం ఎండుదశకు చేరుకుంది. ఏమిచేసినా పంటను కాపాడుకోలేమన్న నిరాశతో వదిలేస్తున్నారు. కొందరు జీవాలకు మేతగా తోటలను ఇచ్చేస్తున్నారు. ఇలా అనంతపురం జిల్లా శింగనమల మండలం తరిమెల గ్రామానికి చెందిన రైతు మునిరెడ్డి వేరుశగ పంటను గొర్రెల మేతకు ఇచ్చాడు. ఈ యన ఐదు ఎకరాల్లో వేరుశగ పంటను సాగు చేశాడు. పంట సాగు నిమిత్తం దాదాపు రూ.1.50 లక్ష వరకు అప్పులు చేశాడు. సకాలంలో వర్షం రాకపోవడంతో పంట మొత్తం ఎండిపోయింది. చెట్లనీ ముడిచుకుపోయాయి. ఇక చెట్లు బతకన్న ఉద్ధేశంతో మనసు చంపుకుని పంట మొత్తాన్ని గొర్రెల మేతకు ఇచ్చేశారు. ఆరుగాలం శ్రమించి సాగు చేసిన పంట మొత్తం ఇలా గొర్రెల మేతకు ఇచ్చేడంపై రైతు కన్నీటి పర్యవంతం అయ్యారు. ఈ పరిస్థితిలో ప్రభుత్వం స్పందించి తక్షణం పంట నష్టపరిహారాన్ని అందించి ఆదుకోవాలంటూ అన్నదాతలు వేడుకుంటున్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్