బుధవారం, 02 సెప్టెంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

Print Editionకొత్త జిల్లాల్లో ఉద్యోగ నియామకాలకు మార్గదర్శకాలు విడుదల

1 గంట క్రితం

ap govt
వెబ్ డెస్క్

ప్రచురించబడింది సెప్టెం 02, 2026, 11:15 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : కొత్త జిల్లాల్లో ఉద్యోగ నియామకాల్లో రోస్టర్ల నిర్వహణ, స్థానిక రిజర్వేషన్ల అమలుపై మార్గదర్శకాలను ప్రభుత్వం విడుదల చేసింది. విడుదల రాష్ట్రపతి ఉత్తర్వులు, 2025 ఆధారంగా సాధారణ పరిపాలన శాఖ కీలకమైన సమగ్ర ఉత్తర్వులను బుధవారం జారీ చేసింది. రాష్ట్రంలోని 26 జిల్లాలు, 6 జోన్లు, 2 మల్టీ జోన్లుగా పునర్వ్యవస్థీకరించబడిన నేపథ్యంలో ఉద్యోగ నియామకాలు, రోస్టర్ల నిర్వహణ, స్థానిక రిజర్వేషన్ల అమలుకు సంబంధించి స్పష్టమైన విధివిధానాలు ఈ ఉత్తర్వుల్లో పేర్కొంది. జిల్లా, జోనల్, మల్టీ జోనల్ క్యాడర్ పోస్టుల ప్రత్యక్ష నియామకాల్లో స్థానిక అభ్యర్థులకు 95 శాతం రిజర్వేషన్ కేటాయించబడుతుందని, మిగిలిన 5 శాతం మాత్రమే ఓపెన్ కాంపిటీషన్ (ఓపెన్ కేటగిరీ) కిందకు వస్తాయని స్పష్టం చేసింది. పాత జిల్లాల్లో/జోన్లలో గతంలో ఎక్కడ నిలిచిపోయిందో అక్కడి నుంచే పాత రోస్టర్ కొనసాగుతుందని, విభజన ద్వారా ఏర్పడిన కొత్త జిల్లాల్లో/జోన్లలో రోస్టర్ పాయింట్-1 నుంచి తాజాగా ప్రారంభమవుతుందని పేర్కొంది. ఎస్సీలకు 200 పాయింట్ల రోస్టర్, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ వర్గాలకు 100 పాయింట్ల రోస్టర్ అమలులో ఉంటాయని, గతంలో మిగిలిపోయిన క్యారీ-ఫార్వర్డ్ ఖాళీలను సంబంధిత కొత్త యూనిట్లలోని ఉద్యోగుల సంఖ్య ఆధారంగా క్రమపద్ధతిలో పంపిణీ చేసి, కొత్త రిక్రూట్‌మెంట్‌ కంటే ముందే భర్తీ చేస్తారని వెల్లడించింది. ప్రతి పోస్టు కేటగిరీని స్థానిక క్యాడర్, రిజర్వేషన్ వారీగా లెక్కించి ఆర్థిక శాఖ అనుమతితో ఎపిపిఎస్‌సి, ఇతర నియామక బోర్డులకు ప్రతిపాదనలు పంపాలని శాఖాధిపతులను ఆదేశించింది.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్