ప్రజాశక్తి - అమరావతి బ్యూరో: శ్రీకాకుళం మాజీ ఎమ్మెల్యే గుండ లక్ష్మీదేవి, ఆమె అనుచరులు గురువారం వైసిపిలో చేరారు. తాడేపల్లిలోని వైసిపి కార్యాలయంలో ఆ పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి వారికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. గుండ లక్ష్మీదేవి కుటుంబానికి తెలుగుదేశం పార్టీతో దాదాపు 40 ఏళ్ల రాజకీయ అనుబంధం ఉంది. ఆమె భర్త మాజీ మంత్రి గుండ అప్పలసూర్యనారాయణ నాలుగుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికై, రెండుసార్లు మంత్రిగా బాధ్యతలు నిర్వహించారు. గుండ లక్ష్మీదేవి 2014 ఎన్నికల్లో టిడిపి తరఫున శ్రీకాకుళం ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. గుండ లక్ష్మీదేవితో పాటు టిడిపి నాయకులు ముద్దాడ ప్రవీణ్ తదితరులు ఉన్నారు. అలాగే కాకినాడ జిల్లా జగ్గంపేట నియోజకవర్గానికి చెందిన పాతంశెట్టి సూర్యచంద్ర, ఆయన భార్య శ్రీదేవి, వారి అనుచరులతో కలిసి వైసిపిలో చేరారు. జగన్ వారికి పార్టీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు. సూర్యచంద్ర 2019 అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన పార్టీ అభ్యర్థిగా, 2024 ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా జగ్గంపేట నియోజకవర్గం నుంచి పోటీ చేశారు.
Print Edition వైసిపిలో చేరిన గుండ లక్ష్మీదేవి
45 నిమిషాల క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది అక్టో 22, 2026, 08:57 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్లు
సంబంధిత వార్తలు






కామెంట్లు (0)