ప్రజాశక్తి-అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షల షెడ్యూల్ విడుదలైంది. ఫస్టియర్ పరీక్షలు ఫిబ్రవరి 24 నుంచి మార్చి 15 వరకు, సెకండియర్ పరీక్షలు ఫిబ్రవరి 25 నుంచి మార్చి 16 వరకు జరగనున్నాయి. రెగ్యులర్, బ్యాక్‌లాగ్ విద్యార్థులకు రోజూ ఉదయం 9గంటల నుంచి మధ్యాహ్నం 12గంటల వరకు ఈ పరీక్షలు జరుగుతాయని ఇంటర్ బోర్డు కార్యదర్శి పి.రంజిత్ బాషా తెలిపారు.
ఫస్టియర్ పరీక్షల తేదీలు: ఫిబ్రవరి 24, 26, మార్చి 1, 3, 5, 9, 12, 15.
సెకండియర్ పరీక్షల తేదీలు: ఫిబ్రవరి 25, 27, మార్చి 2, 4, 8, 11, 13, 16.








కామెంట్‌లు (0)