274 ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి హామీ
ప్రజాశక్తి- తాడేపల్లి (గుంటూరు జిల్లా): గురుకుల ఉపాధ్యాయుల పోరాటం ఫలించింది. 274 మంది ఉపాధ్యాయుల పోస్టులు వెంటనే భర్తీ చేస్తా మనీ ట్రైబల్ వెల్ఫేర్ ప్రిన్సిపల్ సెక్రెటరీ ఎంఎం నాయక్ శుక్రవారం జిఒ జారీ చేసినట్లు ఉపాధ్యాయ సంఘం నాయకులు పరమేష్, మల్లికార్జున నాయక్ తెలిపారు. మిగతా 394 మంది ఉపాధ్యాయులను దఫాల వారీగా విధుల్లోకి తీసుకోవడం జరుగుతుందని హామీ ఇచ్చినట్లు చెప్పారు. ఈ నేపథ్యంలో ఉపాధ్యాయులు సిఐటియు రాష్ట్ర కార్యదర్శి కె.ఉమామహేశ్వరరావుతో సమావేశం అయ్యారు. గురువారం మంత్రి లోకేష్‌ను కలిసి వినతి పత్రం ఇవ్వటానికి వెళ్తున్న ఉపాధ్యాయులను పోలీసులు అరెస్టు చేయటంతో సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు ఉపాధ్యాయులను వెంటనే విధుల్లోకి తీసుకోకపోతే రాష్ట్ర వ్యాప్త ఉద్యమం చేస్తామని హెచ్చరించిన సంగతి తెలిసిందే.








కామెంట్‌లు (0)