జస్టిస్ సుభాష్‌రెడ్డి నేతృత్వంలో నియమించిన సుప్రీంకోర్టు
ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో : విద్యా రంగ ప్రక్షాళన కోసం కాక్రోచ్ జనతా పార్టీ (సిజెపి) ఆధ్వర్యంలో ఢిల్లీలోనూ, దేశవ్యాప్తంగానూ విద్యార్థుల ఆందోళనల సందర్భంగా పోలీసుల అమానవీయ దాడులు, హింసాత్మక ఘటనలపై విచారణ చేపట్టేందుకు సుప్రీంకోర్టు ఉన్నతస్థాయి కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీకి సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ ఆర్ సుభాష్ రెడ్డి అధ్యక్షులుగా, పంజాబ్-హర్యానా హైకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రవి శంకర్ ఝా, ఢిల్లీ హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ షాలిందర్ కౌర్, సిబిఐ మాజీ డైరెక్టర్ రిషి కుమార్ శుక్లా, మేఘాలయ రిటైర్డ్ డిజిపి ఎల్ఆర్ బిష్ణోయ్ సభ్యులుగా ఉంటారు. ఈ ఏడాది జులై 20న ఢిల్లీలో విద్యార్థుల నిరసన సందర్భంగా వారిపై జరిగిన లాఠీఛార్జి, ఎలక్ట్రిక్ బ్యాటన్ల ప్రయోగం, పెల్లెట్ల వినియోగం, టియర్ గ్యాస్ ప్రయోగం వంటి అంశాలపై ఈ కమిటీ విచారణ జరుపుతుంది.
ముందస్తుగా హెచ్చరికలు ఏమీ లేకుండానే విద్యార్థులపై లాఠీలు, ఇ-బ్యాటన్లు, పెల్లెట్లు, టియర్ గ్యాస్ ప్రయోగించిన సంగతి విదితమే. ఇదే సమయంలో నిఘా పేరుతో అత్యాధునిక ఫేషియల్ రికగ్నైజేషన్ కెమెరాలు ఏర్పాటు చేయడం కారణంగా విద్యార్థుల ప్రైవసీకి భంగం కలిగిందా? లేదా? అనే విషయాన్ని కూడా కమిటీ పరిశీలించనుంది. అలాగే, నిరసన సందర్భంగా జరిగిన హింస, దాడులు, వేధింపులు, లైంగికపరమైన దాడులపై కూడా కమిటీ విచారణ జరుపుతుంది. గాయపడిన వారికి సరైన వైద్యం అందించారా? ఆర్థిక సాయం ఏమైనా చేశారా? అనే అంశాలపై కూడా ఆరా తీస్తుంది. అదే సమయంలో పోలీసులు, ఇతర భద్రతా బలగాలపైకి నిరసనకారులు, అసాంఘిక శక్తులు జరిపిన దాడి అంశంపై కూడా కమిటీ విచారణ జరుపుతుంది. నిరసన సందర్భంగా జరిగిన హింస, ఘర్షణలో జరిగిన పబ్లిక్, ప్రైవేటు ఆస్తుల వివరాలు సేకరణ, దాడుల్లో గాయపడ్డ భద్రతా సిబ్బందికి అందిన సాయంతోపాటు మహిళలపై జరిగిన దాడులు, లైంగిక దాడులపై కూడా విచారణ జరపబోతుంది. ఈ విచారణ కోసం అవసరమైన సిసిటివి కెమెరా వీడియోల్ని కమిటీకి అందించాలని సుప్రీంకోర్టు అధికారుల్ని ఆదేశించింది. బాధితుల నుంచి ఫిర్యాదుల్ని స్వీకరిస్తుందని తెలిపింది.







కామెంట్‌లు (0)