గురువారం, 20 ఆగస్టు 2026E-PAPER
మ్యాగజైన్స్

Print Editionశాసనసభలో 103 మందికి మాట్లాడే అవకాశం

1 గంట క్రితం

AP assembly speaker Ayyanna Patrudu
వెబ్ డెస్క్

ప్రచురించబడింది ఆగ 20, 2026, 09:51 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : వర్షాకాల శాసనసభ సమావేశాల్లో నాలుగు రోజుల వ్యవధిలో 103 మందికి మాట్లాడే అవకాశం కల్పించినట్టు స్పీకర్‌ ‌చింతకాయల అయ్యన్నపాత్రుడు తెలిపారు. 16వ శాసనసభలో ఏడవ సమావేశాల గణాంకాలను ఆయన గురువారం సాయంత్రం తెలియజేస్తూ సభ మొత్తం 4 రోజులపాటు సమావేశమైందన్నారు. ఈ 4 రోజుల్లో 25 గంటల 15 నిమిషాల పాటు శాసనసభ కార్యకలాపాలు జరిగాయని చెప్పారు. 40 నక్షత్రం గుర్తు ప్రశ్నలకు మౌఖికంగా సమాధానాలిచ్చారని, 25 నక్ష‍త్రం గుర్తు ప్రశ్నలకు సమాధానాలు సభ సమక్షంలో ఉంచామన్నారు. మొత్తం 12 బిల్లులు సభలో ప్రవేశపెట్టగా, అన్ని బిల్లులు ఏకగ్రీవంగా ఆమోదం పొందాయన్నారు. ఒక బిల్లు ఉపసంహరించబడిందన్నారు. మూడు లఘు చర్చలు జరిగాయని, 344వ నియమం కింద ఒక అంశం పై ముఖ్యమంత్రి, మరొక అంశంపై మంత్రి నారా లోకేష్‌‌ మాట్లాడారని తెలిపారు. ఒక ప్రభుత్వ తీర్మానం ఏకగ్రీవంగా ఆమోదించబడిందన్నారు. ఒక కమిటీ నివేదికను సభకు సమర్పించగా సభ దానిని ఆమోదించినట్లు తెలిపారు. వివిధ అంశాలపై మొత్తం 103 మంది సభ్యులు ప్రసంగించారన్నారు. ఈ సమావేశాలను నిరవధికంగా వాయిదా వేస్తున్నట్లు స్పీకర్ అయ్యన్నపాత్రుడు ప్రకటించారు.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్