డ్రైవర్ల ఐక్యతతోనే విజయం : రోడ్డు ట్రాన్స్ పోర్టు వర్కర్స్ ఫెడరేషన్
ప్రజాశక్తి - భోగాపురం : భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయంలో క్యాబ్ డ్రైవర్లకు పార్కింగ్ ఛార్జీలు రద్దు చేస్తున్నట్లు యాజమాన్య ప్రతినిధి ప్రకటించారు. ఈ నెల 17 నుంచి ఎయిర్ పోర్టులో విమానాల రాకపోకలు ప్రారంభం కాగా, భారీగా పార్కింగ్ ఛార్జీలు వసూలు చేయడంతో క్యాబ్ డ్రైవర్లు, సాధారణ వాహనదారులు జిఎంఆర్ యాజమాన్యంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో ఉబర్, ఓలా, రాపిడో తదితర క్యాబ్ సర్వీసుల్లో పనిచేస్తున్న డ్రైవర్ల సమస్యలను పరిశీలించేందుకు రోడ్డు ట్రాన్స్ పోర్టు వర్కర్స్ ఫెడరేషన్ రాష్ట్ర నాయకులు బి.జగన్, క్యాబ్ యూనియన్ అధ్యక్ష, కార్యదర్శులు జి.శ్రీనివాస రావు, పోలినాయడు తదితరులు గురువారం భోగాపురం ఎయిర్‌పోర్ట్‌ను సందర్శించారు. ఈ సందర్భంగా ఎయిర్‌పోర్ట్‌లోని క్యాబ్ పార్కింగ్ ప్రాంతాన్ని పరిశీలించి, డ్రైవర్లు ఎదుర్కొంటున్న సమస్యలను యాజమాన్య ప్రతినిధి సందీప్‌తో చర్చించారు. దీంతో క్యాబ్ డ్రైవర్లకు పార్కింగ్ ఛార్జీలను రద్దుచేసేందుకు అంగీకరించారు. భవిష్యత్తులో డ్రైవర్లపై అనవసరమైన ఛార్జీలు, వేధింపులు విధిస్తే ఐక్యంగా పోరాడి వాటిని అడ్డుకుంటామని హెచ్చరించారు. డ్రైవర్ల సమస్యలను పరిష్కరించేందుకు ఎయిర్‌పోర్ట్ యాజమాన్యం, సంబంధిత అధికారులు యూనియన్‌తో నిరంతరం చర్చలు జరపాలని కోరారు. ఎయిర్‌పోర్ట్‌లో క్యాబ్ డ్రైవర్లకు స్వచ్ఛమైన తాగునీటి సౌకర్యాన్ని వెంటనే ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ఎయిర్‌పోర్ట్‌లో క్యాబ్ డ్రైవర్లపై పార్కింగ్ ఛార్జీలు విధించడాన్ని సమర్థించేలా జిఎంఆర్ యాజమాన్యానికి అనుకూలంగా మాట్లాడటం సరికాదని విశాఖ ఎంపి భరత్‌కు తగదని జగన్ అన్నారు. క్యాబ్ డ్రైవర్లపై అదనపు భారాన్ని మోపడం అన్యాయమని అన్నారు. కార్యక్రమంలో క్యాబ్ డ్రైవర్స్ యూనియన్ నాయకులు వెంకటేష్, మైకేల్, సిహెచ్. శ్రీనివాస రావు ఉబర్, ఓలా, రాపిడో డ్రైవర్లు పాల్గొన్నారు.







కామెంట్‌లు (0)