హైదరాబాద్ : నార్సింగ్ పోలీస్ స్టేషన్ పరిధిలో తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. రాంగ్ రూట్‌లో వచ్చిన కారు వాకింగ్‌కు వెళ్లిన వారిని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఓ ఆర్మీ జవాన్ మృతి చెందగా, మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాద సమయంలో కారులో ఐదుగురు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. కారులో మద్యం బాటిళ్లు ఉన్నట్లు సమాచారం. సమాచారం అందుకున్న వెంటనే నార్సింగ్ పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని పరిస్థితిని పరిశీలించారు. ప్రమాదానికి సంబంధించిన వివరాలను సేకరించి దర్యాప్తు ప్రారంభించారు. కారు డ్రైవర్‌తో పాటు అందులో ఉన్న యువకుల వివరాలను పోలీసులు ఆరా తీస్తున్నారు. మృతుడి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రి మార్చురీకి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
నాంపల్లిలో హిట్ అండ్ రన్.. ఆర్మీ జవాన్ మృతి
2 గంటల క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది ఆగ 10, 2026, 07:11 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్‌లు
సంబంధిత వార్తలు






కామెంట్‌లు (0)