సోమవారం, 10 ఆగస్టు 2026E-PAPER
మ్యాగజైన్స్

అమెరికాలో రోడ్డు ప్రమాదం.. తిరుపతి జిల్లా వాసి మృతి

1 గంట క్రితం

sri hari
వెబ్ డెస్క్

ప్రచురించబడింది ఆగ 10, 2026, 08:05 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం

ప్రజాశక్తి-తిరుపతి : తిరుపతి జిల్లా చిట్వేల్ మండలం జట్టివారిపల్లెకు చెందిన దిలీప్ కుమార్ (26) అమెరికాలో జరిగిన కారు ప్రమాదంలో మృతి చెందాడు. కెంట్ స్టేట్ యూనివర్సిటీలో ఉన్నత విద్య పూర్తి చేసి, ఐదు నెలల క్రితమే సాఫ్ట్‌వేర్ ఉద్యోగంలో చేరిన దిలీప్.. స్నేహితుడిని విమానాశ్రయంలో దించి తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఒహాయో రాష్ట్రంలోని మాసిడోనియా ప్రాంతంలో ఎదురుగా వచ్చిన పికప్ ట్రక్కు ఢీకొనడంతో దిలీప్ అక్కడికక్కడే మృతిచెందాడు. అమెరికాలో ఉన్నత విద్యనభ్యసించి, ఉద్యోగంలో స్థిరపడి కుటుంబానికి ఆసరాగా నిలుస్తాడనుకున్న యువకుడు రోడ్డు ప్రమాదంలో మృతి చెందడం ఆ కుటుంబంలో పెను విషాదాన్ని నింపింది. మృతదేహాన్ని భారత్‌కు తరలించేందుకు న్యూయార్క్‌లోని భారత కాన్సులేట్ సహకరిస్తోంది.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్